బీజేపీ ఎమ్మెల్యేలను సభలోకి అనుమతించని స్పీకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అనుమతించలేదు. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు,ఈటల రాజేందర్, రాజాసింగ్ ఇవాళ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని కలిశారు. హైకోర్టు ఆదేశాల మేరకు వారు అసెంబ్లీకి వెళ్లి స్పీకర్‌ని కలిశారు. తమ సస్పెన్షన్ పై ఈ ముగ్గురు ఎంఎల్ఎలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
సస్పెన్షన్‌పై స్పీకర్‌దే తుది నిర్ణయమని హైకోర్టు పేర్కొంది. స్పీకర్‌ను కలవాలని హైకోర్టు ఎమ్మెల్యేలకు సూచించింది. దాంతో వారు స్పీకర్‌ను కలిసి కోర్టు ఉత్తర్వుల కాపీ ని అందచేసారు. ఉత్తర్వ్యులు ఎప్పుడు వచ్చాయని స్పీకర్ వారిని అడిగారు. సోమవారం సాయంత్రం వచ్చాయని చెప్పినట్టు ఎమ్మెల్యే రఘునందన్ రావు వివరించారు. ఏమైనా చెప్పేది ఉందా అని స్పీకర్ అడగటంతో వారు తమ వాదనలు వినిపించారు. తాను, ఈటల రాజేందర్ తమ తమ స్థానాల నుంచి కదలలేదని స్పీకర్‌కు వివరించినట్టు రఘునందన్ రావు చెప్పారు.
Also Read
- KTR : బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో తెలంగాణ బిడ్డ.. ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
- Peddi Sudarshan Reddy : పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులిటెన్ విడుదల
- KTR : హైడ్రా సంస్కరణ కాదు.. అరాచక సంస్థ.. కేటీఆర్ ఫైర్
- Kalyana Lakshmi: కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ కోసం అడ్డదారులు.. గుట్టురట్టు చేసిన పోలీసులు..
ఎమ్మెల్యేల అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారు. వారిని సభలోకి అనుమించేదిలేదని స్పష్టం చేశారు. దాంతో వారు అసెంబ్లీ నుంచి తిరిగి వెళ్లిపోయారు. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకున్నారే కానీ, ప్రజాస్వామ్య స్ఫూర్తి ని గౌరవించలేదని ఎమ్మెల్యే రఘునందన రావు వ్యాఖ్యానించారు. రేపు టీఆర్ఎస్ ని చూసి నవ్వే రోజు వస్తుందన, ప్రజలే వారిని శిక్షిస్తారని బీజేపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
-
OTR: పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..? కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశామా అంటున్నారా..?
-
Prof V Kamakoti: ప్రియాంకా గాంధీ ‘‘గోమూత్ర నిపుణుడు’’ అని పిలిచిన ప్రొఫెసర్ కామకోటి ఎంత గొప్పవారో తెలుసా.?
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!