బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అనుమతించలేదు. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు,ఈటల రాజేందర్, రాజాసింగ్ ఇవాళ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని కలిశారు. హైకోర్టు ఆదేశాల మేరకు వారు అసెంబ్లీకి వెళ్లి స్పీకర్‌ని కలిశారు. తమ సస్పెన్షన్ పై ఈ ముగ్గురు ఎంఎల్‌ఎలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సస్పెన్షన్‌పై స్పీకర్‌దే తుది నిర్ణయమని హైకోర్టు పేర్కొంది. స్పీకర్‌ను కలవాలని హైకోర్టు ఎమ్మెల్యేలకు సూచించింది.…