Telangana Assembly: ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్‌పై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly: నేడు(ఆరో రోజు) తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. తెలంగాణ శాసన సభలో జీరో అవర్ ప్రారంభమైంది. అసెంబ్లీ ఇన్సైడ్ చైర్ అనుమతి లేకుండా మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, వీడియో ప్రదర్శన చేయొద్దని స్పీకర్ గడ్డం కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద సభ్యులు మాట్లాడవద్దని తెలిపారు. బ్రేక్ టైం లేదా సభ వాయిదా తరువాతే సభ్యులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడాలని అన్నారు. బీజేపీఎల్ ఫ్లోర్ లీడర్ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. ఇవాల అసెంబ్లీలో బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. ఉభయ సభల్లో కాగ్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్‌ను ప్రభుత్వం సభలో పెట్టనుంది. ఇరిగేషన్, రెవిన్యూ, ఫైనాన్స్, పంచాయితీరాజ్ రిపోర్ట్‌లను టేబుల్ చేయనుంది. అసెంబ్లీలో పలు ప్రకటనలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయనుంది. నిన్న ఈ అంశంపైనే బీఆర్ఎస్ ఆందోళన చేపట్టిందని అన్నారు. మీడియా పాయింట్ వద్దకు అనుమతించకపోవడంతో.. అసెంబ్లీలో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపిన విషయం తెలిసిందే..
Read also: European Union: రష్యాకు సహాయం చేసినందుకు భారత్, చైనీస్ సంస్థలపై ఈయూ ఆంక్షలు
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
నిన్న తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ శ్వేత ప్రతం ప్రవేశపెట్టారు. కాగా.. బడ్జెట్ పై బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ ను ప్రభుత్వం సీరియస్ తీసుకోవడం లేదని కడియం మండిపడ్డారు. బడ్జెట్ పై చర్చ జరుగుతుంటే ఆర్థిక మంత్రి, సీఎం రేవంత్ లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై చర్యలో ఒక్క అధికారి తప్ప ఎవ్వరూ లేరని అన్నారు. మంత్రులకు ఏమైనా డౌట్ ఉంటే బడ్జెట్ పుస్తకం చదువుకోవాలని తెలిపారు. బడ్జెట్ పుస్తకం తయారు చేసేటప్పుడు సరిచేసుకోవాలన్నారు. అందరి కోసం కాదు కొందరి కోసం చేస్తుందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఒకవైపు లెక్కల్లో గత ప్రభుత్వాన్ని పొగుడుతూ.. మరో వైపు బయట తిగుతున్నారు అంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వం పాలన సరిగ్గా లేకపోతే తలసారి ఆదాయం ఎలా పెరుగుతుంది? అని ప్రశ్నించారు. మరోవైపు అసెంబ్లీలో అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికార పార్టీ నేతల తీరును నిరసిస్తూ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వచ్చేశారు.
CPI Ramakrishna: ఎన్నికల కోసమే ఉమ్మడి రాజధాని డ్రామా..!
తాజావార్తలు
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
ట్రెండింగ్
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!