Telangana Airports: తెలంగాణలో ఎయిర్‌పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
- మామునూరుకు టెండర్లు
- ఆదిలాబాద్‌లో ఎంఆర్ఓ
- హెలీ టూరిజంపై ఫోకస్
- హుస్సేన్ సాగర్‌లో సీ ప్లేన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని ఆదిలాబాద్, మామునూరు (వరంగల్) విమానాశ్రయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్లో కేంద్ర మంత్రితో బుధవారం సమావేశమైన సీఎం, మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావలసిన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎంఆర్ఓ వసతులు
ఆదిలాబాద్ విమానాశ్రయంలో ప్యాసింజర్, కార్గో టెర్మినళ్లతో పాటు ఎంఆర్ఓ (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్) సదుపాయాలను కూడా కల్పించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అక్కడ రన్‌వేను ఖరారు చేసేందుకు గాను రక్షణ, పౌర విమానయాన శాఖల అధికారులతో వెంటనే సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు స్పందించిన కేంద్ర మంత్రి, మామునూరు ఎయిర్‌పోర్టుకు సంబంధించి రెండు వారాల్లో టెండర్లు పిలిచి, డిసెంబరు నాటికి వాటిని ఖరారు చేస్తామని తెలిపారు. అలాగే డిసెంబరులోనే పనులకు శంకుస్థాపన కూడా చేస్తామని సీఎంకు హామీ ఇచ్చారు.
Also Read
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
- Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
- Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
- Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
హెలీ టూరిజం, సీ ప్లేన్ ల్యాండింగ్
రాష్ట్రంలో ఛాపర్ల (హెలికాప్టర్లు) ద్వారా ‘హెలీ టూరిజం’ను ప్రోత్సహించాలని, దీనివల్ల తెలంగాణ పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కాగా, హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో సీ ప్లేన్ ల్యాండింగ్‌కు ఉన్న అవకాశాలపై రూపొందించిన అధ్యయన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సమావేశంలో ఎంపీలు సురేశ్ షెట్కార్, ఎం. అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, సీఎస్ సంజయ్ జాజు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
-
Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే…!
-
Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..