ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయ అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ (Joint User Airfield) ఏర్పాటుకు సంబంధించి మొత్తం 700 ఎకరాల భూసేకరణకు అనుమతి మంజూరు చేసింది.
విమానాశ్రయం ఏర్పాటు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ వాసుల కలలు త్వరలోనే ఫలించబోతున్నాయి. ఆదిలాబాద్‌లోని రక్షణశాఖకు సంబంధించిన వైమానిక విమానాశ్రయంలో పౌరవిమానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. శుక్రవారం ఈ మేరకు రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. కీలకమైన ఆదిలాబాద్ విమానాశ్రయంలో వాయుసేన శిక్షణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నామని, దీంతోపాటు.. పౌర విమాన సేవల కోసం ఉమ్మడి కార్యాచరణ చేపట్టేందుకు సానుకూలంగా ఉన్నట్లు…
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసేందుకు తలపెట్టిన ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పౌరవిమానాశ్రయానికి భారత వాయుసేన (IAF) అంగీకరించింది. భారత ఎయిర్ ఫోర్స్ నుంచి అనుమతులు రావడంపై జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, పౌరవిమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరిగణలోకి తీసుకుంది.