Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sampoornesh Babu: వెండితెరపై ‘బర్నింగ్ స్టార్’గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సంపూర్ణేష్ బాబు రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారు? తెర వెనుక ఉండే అసలైన నరసింహాచారి వ్యక్తిత్వం ఎలాంటిది? తాజాగా నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ‘బిర్యానీ’ అనే ప్రత్యేక పాత్రతో అలరించడానికి రెడీ అవుతున్న సంపూర్ణేష్ బాబు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సమాజం చూసే సక్సెస్ కొలమానాలపై చేసిన కామెంట్స్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ రంగంలో సాధించిన సక్సెస్‌లపై స్పందిస్తూ, బయట ప్రపంచం తనను సంపూర్ణేష్ బాబుగా చూసినప్పటికీ, తన సన్నిహితుల మధ్య తాను ఎప్పటికీ పాత నరసింహాచారినే అని ఆయన స్పష్టం చేశారు. “కెమెరా ముందు మాత్రమే నేను సంపూర్ణేష్ బాబు. కెమెరా ఆఫ్ అవ్వగానే నా సొంత మనుషులు, పిల్లలు, స్నేహితుల మధ్య సాధారణ నరసింహాచారిగానే ఉంటాను. ఆ స్టార్‌డమ్‌ను నా చుట్టూ ఉన్నవాళ్లు ఎంజాయ్ చేస్తుంటారు కానీ, నాకు మాత్రం ఆ హంగులు పెద్దగా పట్టవు” అని తన మనసులోని భావాలను పంచుకున్నారు.
సమాజం విజయాన్ని కొలిచే పద్ధతిపై సంపూ సూటిగా స్పందించారు. ప్రజలు సాధారణంగా ఓ వ్యక్తి సక్సెస్‌ను అతడి ఇల్లు, కార్లు, పిల్లలు చదివే స్కూళ్లను బట్టి అంచనా వేస్తారని ప్రస్తావిస్తూ.. “సిద్దిపేటలో మంచి ఇల్లు కట్టుకున్నా, రెండు కార్లు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడికైనా అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు డ్రైవర్ లేడనో, నాకే డ్రైవింగ్ చేసే ఓపిక లేదనో ప్రయాణాన్ని ఎప్పుడూ ఆపుకోను. వెంటనే బస్ ఎక్కేసి ప్రయాణం స్టార్ట్ చేస్తాను. నాకు అందులో ఎలాంటి ఇబ్బంది, భేషజాలు కనిపించవు” అని అన్నారు. “సమాజం కోసం బతకాల్సిన అవసరం నాకు లేదు. నా కుటుంబం, నన్ను ప్రాణంగా ఇష్టపడే వాళ్లతో సంతోషంగా ఉంటే చాలు. ఇతరుల కోసమో, ఏదో గొప్పకు పోయో నేను ఏది కొన్నా కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటప్పుడు సమాజం నన్ను ఎలా చూస్తుందనే ఆలోచనతో రిస్క్ చేయడం దండగ” అంటూ నేటి ఆర్భాటాల ప్రపంచానికి భిన్నంగా తన డౌన్-టు-ఎర్త్ ఫిలాసఫీని చాటిచెప్పారు. ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనేది చాలా ఆసక్తికరంగా మారింది.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!