Telangana 10th results: తెలంగాణ 10వ తరగతి ఫలితాలు నేడే విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 10వ తరగతి ఫలితాలను ఇవాల మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. టెన్త్ ఫలితాల కోసం ntvtelugu.com , https://results. tsbse.telangana.gov.in, https//results. tsbsetelangana. వెబ్‌సైట్‌లలో చూడవచ్చు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పది పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 10వ తరగతి పరీక్షలకు 99.63 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. పది పరీక్షలకు 4,86,194 మంది రెగ్యులర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 4,84,384 మంది పరీక్షలు రాశారు. 1,809 మంది పరీక్షలకు హాజరు కాలేదు. ప్రైవేటు విద్యార్థులు 443 మంది దరఖాస్తు చేసుకోగా, 191 మంది మాత్రమే హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిన్న (మంగళవారం) విడుదల చేశారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటించారు. రెండింటిలోనూ బాలికలు రాణించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు మొత్తం 4 లక్షల 33 వేల 82 మంది హాజరు కాగా వారిలో 2,72,208 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం 63.85 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 1,60,000 మంది ఏ గ్రేడ్‌లో, 68,335 మంది బీ గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు.
ఇక, బాలికలు 68 శాతం ఉత్తీర్ణులైతే, బాలురు 56.82 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇదిలావుంటే.. ద్వితీయ సంవత్సరంలో.. మొత్తం 3,80,920 మంది హాజరుకాగా 2,56,241 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా, ద్వితీయ సంవత్సరంలో మొత్తం 67.26 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో ఏ గ్రేడ్ లో లక్షా 73 వేలు, బీ గ్రేడ్ లో 54,786 మంది ఉత్తీర్ణత సాధించగా… 73.46 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. బాలురు 60.66 శాతం ఉత్తీర్ణులయ్యారు. కానీ వృత్తి విద్యా కోర్సుల విషయానికి వస్తే మొదటి సంవత్సరంలో మొత్తం 2,55,533 మంది, ద్వితీయ సంవత్సరంలో 28,738 మంది ఉత్తీర్ణులయ్యారు.
Karnataka assembly elections Live Updates: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ..