Tarun Chugh: తెలంగాణలో జంగిల్ రాజ్ నడుస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో భయానక వాతావరణం నెలకొందని.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని విమర్శించారు బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్. ముఖ్యమంత్రి, మంత్రులు మీ ఆఫీసులకు ఎప్పుడు వెళ్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ అన్నింటిలో ఫెయిల్ అయిందని.. లా అండ్ ఆర్డర్, పరిపాలనలో, హామీల అమలులో విఫలం అయిందని ఆయన విమర్శించారు. కేసీఆర్ రూ.109 కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ పర్సనాలిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ డబ్బులను తెలంగాణ ప్రజల కోసం స్కూళ్లు, రోడ్లు, దళిత బంధు పథకంలో ఉపయోగపడుతుందని కానీ.. ముఖ్యమంత్రి తన ముఖం చూపించుకోవడాని ప్రకటనలకు ఇస్తున్నారని విమర్శించారు.
తెలంగాణలో ఫార్మ్ హౌజ్ అధికారిక కేంద్రంగా మారిపోయిందని విమర్శించారు. తెలంగాణలో రక్షకుడు, భక్షకుడిగా మారారని విమర్శించారు. కేసీఆర్ ఆఫీసులకు వెళ్లడని, హోమ్ మినిస్టర్ ఉన్నాడా..? లేదా..? అని ప్రశ్నించారు. సీఎం ఫార్మ్ హౌజ్ లో, సీఎం కొడుకు ట్విట్టర్ లో, హోం మంత్రి సెలవులో ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు. పోలీసు అధికారులు రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మాట్లాడేందుకు మీ దగ్గర సమయం లేదా..? అని ప్రశ్నించారు. మీ పోలీసులు నిందుతులకు సహాయం చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.
Also Read
కేసును సీబీఐకి అప్పగిస్తే నిందితులెవరో తెలుస్తుందని ఆయన అన్నారు. తెలంగానలో జంగిల్ రాజ్ నడుస్తుందని.. న్యాయ వ్యవస్థకు స్థానం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణలో మహిళలు సురక్షితంగా లేరని ఆరోపించారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన అన్నారు. ఘటన జరిగిన ప్రభుత్వంలో చలనం లేదని.. అసమర్థ ప్రభుత్వం అని.. కుటుంబ రాజకీయాల్లో మునిగిపోయిందని విమర్శించారు.
తాజావార్తలు
-
Trikala : ఏకంగా మూడు OTTలలో త్రికాల స్ట్రీమింగ్
-
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్‌గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్‌లో అభిమానులు
-
Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
-
Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
-
Lenin Box Office Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..