Talasani Srinivas Yadav: నేను చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నా.. మంత్రి తలసాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Talasani Srinivas Yadav Reaction To Congress Leaders Comments: ప్రియాంకా గాంధీ, రేవంత్ రెడ్డిలపై మంత్రి తలసాని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే! దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంకా గాంధీపై తలసాని చేసిన వ్యాఖ్యలు.. ఆయన దురహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రమిచ్చి, తెలంగాణ ప్రజల చిరకాల కోరిక తీర్చిన సోనియమ్మ బిడ్డ ప్రియాంకపై విమర్శలు చేయడం దారుణమన్నారు. రేవంత్‌పై తలసాని చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన కాంగ్రెస్ నేతలు.. కేసీఆర్, కేటీఆర్‌లను పొగడటం తప్ప అంతకుమించి తలసాని చేసిందేమీ లేదంటూ ధ్వజమెత్తారు. ఇలా కాంగ్రెస్ నేతలు ఎటాక్ చేయడంతో.. మంత్రి తలసాని తాజాగా స్పందించారు. తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు.
Nikki Tamboli: పైట జార్చి మరీ పరువాలను చూపించి హీటెక్కిస్తోందే
Also Read
- Harish Rao: ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు లాక్కోవడమా? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు
- Telangana Govt: పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు.. టీచర్ల సర్దుబాటుపై కలెక్టర్లకు పూర్తి అధికారం!
- Medak Double Murder Case: ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన EMI.. మెదక్‌లో జంట హత్యల కలకలం..
- Hyderabad: కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలు.. ‘కంచి కేఫ్’, ‘కోడికూర చిట్టిగారే’ రెస్టారెంట్లకు నోటీసులు!
‘‘ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు సరికాదు. రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేసేటప్పుడు హుందాతనంగా వ్యవహరించాలి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా.. మంత్రులు, ఎమ్మెల్యేల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు విమర్శలు చేయడం కరెక్టా? తమ పార్టీ నేతలపై అసభ్యకర భాషతో చేసిన విమర్శలతో నేను ఆవేదన చెందాను. బాధ్యత కలిగిన మంత్రిగా నేను ఆవేదనతో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను. పార్టీలు వేరైనప్పటికీ విమర్శలు అర్థవంతంగా ఉండాలి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం సరికాదు. ఇకనైనా బాధ్యతగా మాట్లాడుతూ.. ఒకరినొకరు గౌరవించుకోవాలి’’ అని మంత్రి తలసాని చెప్పారు. అంతేకాదు.. విమర్శకు ప్రతి విమర్శ కూడా అంతే కఠినంగా ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ ఆయన హెచ్చరించారు కూడా!
Malaika Arora: ఆకులో ఆకువై.. పువ్వులో పువ్వువై.. అందాలను ఒలికిస్తుందిలా
కాగా.. మంత్రి తలసాని ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘నిన్న ఆమె (ప్రియాంక) వచ్చింది. ఆమె ఒక డిక్లరేషన్ ఇచ్చింది. ఆ పొట్టోడు డిక్లరేషన్ గురించి మాట్లాడతాడు. వాడి నోటికి అడ్డు అదుపు అనేదే లేదు. ఎమ్మెల్యేలను, మంత్రులను వాడు వీడు అని మాట్లాడతాడు. ఇంత లేడు, వాడి పర్సనాలిటీ ఎంత, వాడెంత? పిసికితే ప్రాణం పోతుంది. వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు’’ అంటూ రెచ్చిపోయారు. ఇలా ఈయన చేసిన వ్యాఖ్యలపైనే కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
విజయ్‌కి మద్దతుగా యువ హీరో హాట్ హాట్ కామెంట్స్
-
Aman Rao Perala: ఎవరయ్యా వైభవ్ సూర్యవంశీ.? 32 బంతుల్లో సెంచరీ చేసిన హైదరాబాద్ బ్యాటర్.!
-
Rare Fish: అంతర్వేదిలో అరుదైన ఫిష్.. మత్స్యకారులకు అదృష్టాన్ని తెచ్చిన ‘మగ కచిడి చేప’!
-
Harish Rao: ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు లాక్కోవడమా? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు
-
Maa Inti Bangaram: సమంతకు మరో బిగ్ సక్సెస్.. కేవలం 4 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లోకి!
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!