TSPSC: తెలంగాణలో TSPSC పేపర్ లీకేజీ కేసు ఇప్పుడు హాట్ టాపిక్. పేపర్ లీకేజీ విషయంలో సిట్ నిందితుల నుంచి కూపీ లాగుతున్న తరుణంలో TSPSC కేసులో ఏ-3 నిందితురాలిగా వున్న రేణుక రాథోడ్ బెయిల్ పిటిషన్ చర్చకు దారితీసింది. రేణుక బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు లో తీర్పు ఇవ్వనుంది. రేణుక అనారోగ్యంతో ఉందనీ, తనకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని వారి బాగోగులు చూసే వారు ఎవరూ లేనందున బెయిల్ ఇవ్వాలని రేణుక తరఫు న్యాయవాది కోర్ట్ ను కోరారు. సిట్ విచారణకు ఆమె మొదటి నుంచి సహకరిస్తోందని, ఇక ముందు కూడా సహకరిస్తుందన్న న్యాయవాది పేర్కొ్న్నారు. ఈ కేసులో రేణుకకు ప్రత్యక్ష ప్రమేయం లేదని, ఇది కేవలం ప్రాథమిక నేరాభియోగం మాత్రమే అని రేణుక లాయర్ తెలిపారు. కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదని, చాలా మంది పాత్ర ఇందులో ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. సిట్ విచారణలో వెల్లడైందని కోర్టుకు తెలిపారు. ఈ దశలో బెయిల్ ఇస్తే విచారణపై ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు. నేడు రేణుకా బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం ఇవ్వనుంది అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
Read also: IPL 2023: ఇవేం పిచ్ లు రా బాబు.. పరుగులు చేయడం కష్టమే!
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో కీలక నిందితురాలైన రాథోడ్ రేణుకపై ఆరా తీస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లా గన్‌హీడ్ మండలానికి చెందిన రేణుక వనపర్తి ఎస్సీ గురుకుల విద్యాలయంలో హిందీ పండిట్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త ఢాక్యానాయక్ వికారాబాద్ జిల్లా పరిగిలోని డీఆర్‌డీఏలో పనిచేస్తున్నారు. కానీ రేణుక ఈ ఏడాదిలో 12 సెలవులు తీసుకుంది. ఇందులో మార్చి నెలలో 6 సెలవులు ఇచ్చారు. రేణుక తన బంధువు మృతి చెందాడని సెలవు పెట్టి మార్చి 4, 5 పేపర్ విక్రయించిన అభ్యర్థులను రేణుక దంపతులు సిద్ధం చేసుకున్నారు. రేణుక సర్టిఫికెట్లపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేణుకపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని గురుకుల ప్రిన్సిపాల్ గురుకుల కార్యదర్శి రోనాల్డ్ రోస్‌కు లేఖ రాశారు. రేణుకతో పాటు ఆమె భర్త ఢాక్యా నాయక్‌కు సంబంధించిన వారందరినీ సిట్ పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా షమీమ్, రమేష్, సురేష్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. పేపర్ లీక్ కేసులో లక్షల రూపాయలు చేతులు మారినట్లు గుర్తించారు. రేణుక భర్త ఢాక్యా నాయక్ బ్యాంకు ఆర్థిక లావాదేవీలను పరిశీలించిన పోలీసులు కీలక అంశాలను గుర్తించారు.
Dasara: రికార్డ్ హిట్ కొట్టిన నాని… కొన్ని సెంటర్స్ లో స్టార్ హీరోల రికార్డులు గల్లంతు