KTR: సూర్యాపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దేశానికి చాటింది మొదట ఎన్టీఆర్.. ఆ తరువాత కేసీఆర్ అని తెలిపారు. గులాబీ జెండా లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు అని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీగా కూడా సమర్థవంతంగా నిలబడింది.. విజయవంతంగా ఉద్యమం, సమర్థవంతమైన పాలన అందించింది బీఆర్ఎస్ పార్టీ.. తమ పాలన తెలంగాణ రాష్ట్రానికి అవసరం.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తరువాత బీఆర్ఎస్ పని అయిపోయిందని మాట్లాడుతున్నారు.. కానీ, ప్రజల ఆశీర్వాదంతో నిలబడ్డాం.. సీఎం పర్సంటేజ్ లు పెంచుకుంటున్నారు.. అసూయ, ద్వేషం, ఆశలను మాపై ప్రచారం చేయడంతో ఓడిపోయామని కేటీఆర్ అన్నారు.
Read Also: AP Legislative Council: ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని పీపీపీ మోడ్‌లో నిర్మిస్తాం!
ఇక, బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పాత్ర, ఉద్యమాలు కొత్త కాదు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ యూట్యూబర్లను అడ్డం పెట్టుకుని సీఎం అయ్యారో.. అదే యూట్యూబర్లపై కేసులు పెడుతున్నారు.. బీఆర్ఎస్ నేతల్ని సోషల్ మీడియాలో ఎంతగా తిట్టారో ప్రజలకు తెలుసు అని చెప్పుకొచ్చారు. అలాగే, రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.