Uttam Kumar Reddy: నేడు సూర్యాపేట నియోజకవర్గాల్లో ఉత్తమ్ కుమార్ పర్యటన..

  • కోదాడ
  • హుజూర్ నగర్ నియోజక వర్గాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన..
  • అనంతగిరిలో తహసీల్దార్
  • ఎంపీడీఓ
  • పోలీస్ స్టేషన్ భవనాలకు శంఖుస్థాపన..
Uttamkumar Reddy

Uttamkumar Reddy

Uttam Kumar Reddy: సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్ నగర్ నియోజక వర్గాల్లో రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పనులపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కోదాడలో ముస్లిం కమ్యూనిటీ హాల్ స్థల పరిశీలించనున్నారు. అనంతగిరిలో తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్ భవనాలకు శంఖుస్థాపన చేయనున్నారు. హుజూర్ నగర్ లో రామస్వామి గుట్ట వద్ద క్రిస్టియన్ స్మశాన వాటిక పనుల పరిశీలించనున్నారు.

Read also: SSMB29: మహేష్ బాబు సినిమలో విలన్ గా మలయాళం స్టార్ హీరో..?

మేళ్లచెర్వులో రూ.కోటి 50 లక్షలతో ముస్లిం కమ్యూనిటీ హాల్ శంఖుస్థాపన అనంతరం 55 లక్షలతో మేళ్లచెర్వు శివాలయం రాజగోపురం శంఖుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి హుజూర్ నగర్ లో మినీ స్టేడియం స్థలాన్ని పరిశీలించనున్నారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీలో TUFIDC పనులపై సమీక్షించనున్నారు. పాలకవీడులో తహసీల్దార్, MPDO, పోలీస్ స్టేషన్ భవనాలకు శంఖుస్థాపన చేయనున్నారు. అనంతరం నేరేడుచర్ల మున్సిపాలిటీ లో TUFIDC పనులపై సమీక్షించి అక్కడి నుంచి హైదరాబాద్ కు తిరుగుప్రయాణం కానున్నారు.
Hathras Stampede: యూపీ తొక్కిసలాటలో 116 మంది మృతి.. నేడు హత్రాస్కు సీఎం యోగి..