దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. అయితే.. వైద్యురాలనికి నలుగురు నిందితులు శంషాబాద్‌లోని చటాన్‌పల్లిలో వద్ద గల అండర్ పాస్ బ్రిడ్జి వద్ద అత్యాచారం చేసి హత్య చేశారు. దీంతో పోలీసులు నిందితులను 24 గంటల్లోనే పట్టుకున్నారు. అయితే.. 2019 డిసెంబరు 6న సీన్ రీ కన్స్ట్రక్షన్లో నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు యత్నించిన సమయంలో.. పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు నిందితులు మరణించారు.
దీంతో… పోలీసులు ఫేక్ ఎన్కౌంటర్ చేశారంటూ.. నిందితుల కుటుంబ సభ్యులు, మానవ హక్కుల సంఘం నాయకులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో.. సుప్రీం కోర్టు జస్టిస్ సిర్పూర్కర్ నేతృత్వంలో.. హై కమిషన్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో 3 సంవత్సరాల పాటు దిశ ఎన్‌కౌంటర్‌పై జస్టిస్ సిర్పూర్కర్, రేఖ ప్రకాశ్, కార్తికేయన్ సభ్యులతో త్రిసభ్య కమిషన కమిషన్ విచారణపూర్తి చేసింది.
ఇటీవల నివేదికను సుప్రీంకోర్టుకు సిర్పూర్కర్ కమిషన్ సమర్పించింది. ఈ క్రమంలోనే కమిషన్ నివేదిక గోప్యంగా ఉంచాలని పోలీసులు కోరినట్లు తెలుస్తోంది. అయితే సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఆధారంగా.. నేడు సుప్రీం కోర్టు విచారణ జరిపి తీర్పు ఇవ్వనుంది. అయితే ఈ విచారణకు అప్పటి సైబరాబాద్ పోలీస్ కమీషనర్, ప్రస్తుత టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హజరుకానున్నారు.
దీంతో ఈ రోజు సుప్రీం కోర్టు ఇవ్వనున్న తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే.. మా కుటుంబాన్ని ఆదుకునేలా తీర్పు వస్తుంది అనుకుంటున్నాము.. మా కుటుంబానికి పెద్ద దిక్కైన కొడుకునే కోల్పోయాం.. నష్ట పరిహారంతో పాటు, పోలీస్ లకు కూడా శిక్ష పడాలి.. ఏ1 నిందితుడు ఆరిఫ్ తల్లిదండ్రులు.. హుస్సేన్, మౌలానా బీ మీడియాతో అన్నారు.