ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మానవాళిపై భానుడికి కోపం వచ్చినట్లుంది. వేసవికాలం ప్రారంభంలోనే ఎండ తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. సూర్యుడు తగ్గేదేలే అనే విధంగా ఉగ్రరూపంలో ప్రజలపై విరుచుకుపడుతున్నాడు. ఎండ తీవ్రత దృష్ట్యా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పాఠశాల పనివేళలను కుదించింది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎండలు మండుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలో నమోదయ్యాయి.
కొమురం భీం జిల్లా కెరమెరి లో43.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, కౌటాల లో 43.7 గా నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా చెప్రాలలో 43.8 డిగ్రీలు, జై నాథ్‌లో 43.8 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్ లో 43.3 గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్ర దృష్ట్యా స్కూల్ వేళల్లో మార్పు చేస్తూ.. ఉదయం 8గంటల నుంచి 11.30 గంటల వరకే విద్యాశాఖ అనుమతినిచ్చింది. ఈ మేరకు విద్యా శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.