Srushti Testtube Baby Centre: ఎఫ్ఐఆర్లో సంచలన వివరాలు
- సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై గోపాలపురం పోలీసుల కేసు నమోదు
- IVF ప్రొసీజర్ పేరుతో ₹30 లక్షల వసూళ్లు – బాధితురాలు ఆరోపణలు
- విశాఖ బ్రాంచ్‌లో శాంపిల్ కలెక్షన్‌పై అనుమానాలు
- BNS 61,316,318,335,336,340 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srushti Testtube Baby Centre: హైదరాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై నమోదైన కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గోపాలపురం పోలీసులు ఈనెల 25న ఈ కేసును నమోదు చేసినట్లు అధికారికంగా ధృవీకరించారు. రాజస్థాన్‌కు చెందిన బాధితురాలు సోనియా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాధితురాలు సోనియా తన ఫిర్యాదులో, గత సంవత్సరం ఆగస్టు నెలలో డాక్టర్ నమ్రతను సంప్రదించామని పేర్కొంది. సంతానం కోసం IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ప్రొసీజర్ చేయించాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. అయితే, ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రత ₹30 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
Also Read
MLA Sanjay : ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సెల్ఫీ వీడియో.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
ఈ మొత్తంలో ₹15 లక్షలు చెక్కు రూపంలో, మిగతా ₹15 లక్షలు బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్లు బాధిత దంపతులు తెలిపారు. అంతేకాక, కేవలం మెడికల్ టెస్టులకే ₹66,000 అదనంగా తీసుకున్నారని సోనియా ఆరోపించింది.
ప్రొసీజర్‌లో భాగంగా సోనియా దంపతులను విశాఖపట్నంలోని మరో బ్రాంచ్‌కి పంపించారని, అక్కడ శాంపిల్ కలెక్షన్ జరిగింది అని ఫిర్యాదులో వివరించారు. అయితే, ఈ ప్రక్రియలో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసును గోపాలపురం పోలీసులు BNS 61, 316, 318, 335, 336, 340 సెక్షన్ల కింద నమోదు చేశారు. ఇవి మోసం, దొంగతనం, బలవంతం, ఇతర క్రిమినల్ నేరాలకు సంబంధించిన సెక్షన్లు కావడం గమనార్హం.
Hamas: టర్కీకి పారిపోయి మళ్లీ వివాహం చేసుకున్న “హమాస్” చీఫ్ భార్య..
తాజావార్తలు
-
Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!