Srushti Fertility Scam: అక్రమ సృష్టి తో అమాయక దంపతులు, చిన్నారుల జీవితాలతో చెలగాటమాడిన డాక్టర్ నమ్రత పాపాల పుట్ట కదిలింది. తొలుత తనకే పాపం తెలియదని మహానటి సావిత్రి రేంజ్ లో నటించినా.. పోలీసులు అన్ని ఆధారాలు ముందుంచే సరికి కళ్లు తేలేసింది. తాను చేసిన అక్రమాలన్నీ తానే ఒప్పుకుంది. ఎందుకు చేయాల్సి వచ్చింది.. ? ఎప్పటి నుంచి చేస్తోంది..? ఎవరెవరిని భాగస్వామ్యులను చేసింది..? ఎన్ని కోట్లు వెనకేసుకుంది..? ఇలా ప్రతీ అంశాన్ని పూసగుచ్చినట్లు పోలీసులకు…
Hyderabad Surrogacy Racket: సృష్టిలో అక్రమాలు నిజమే అంటూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు.. చాలావరకు తెలిసే తప్పులు చేశామని పోలీసులకు స్పష్టం చేశారు. సరోగసి చేయకపోయినా చేసినట్లు దంపతులను నమ్మించి మోసం చేశామన్నారు. రాజస్థాన్ దంపతులను కూడా సరోగసి చేయకపోయినా చేసినట్లు నమ్మించామని.. డీఎన్ఏ పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని తప్పించుకున్నామన్నారు.
హైదరాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై నమోదైన కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గోపాలపురం పోలీసులు ఈనెల 25న ఈ కేసును నమోదు చేసినట్లు అధికారికంగా ధృవీకరించారు.