Minister Sridhar Babu : అక్బరుద్దీన్‌కు మంత్రి శ్రీధర్ బాబు స్ట్రాంగ్ కౌంటర్: జూబ్లీహిల్స్‌లో గెలిచింది మేమే.. ఎవరి మద్దతోనో కాదు..
- అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఘాటు స్పందన
- జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ సొంత బలంతోనే విజయం
- సుపరిపాలనే ప్రజల మద్దతుకు కారణమని వ్యాఖ్య
- ఎంఐఎం రాజకీయ ఉనికి కోసమే ఇలాంటి మాటలని విమర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Sridhar Babu : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసిన తరుణంలో అధికార కాంగ్రెస్, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం ముదిరింది. “ముఖ్యమంత్రులే మా దగ్గరకు రావాలి” అని అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ గెలుపుపై అక్బరుద్దీన్ చేసిన క్లెయిమ్‌ను ఆయన తోసిపుచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం మరొకరి భిక్ష కాదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. “జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసి గెలిచింది. మా పార్టీ నేతలు, కార్యకర్తలు రాత్రింబగళ్లు కష్టపడితేనే ఆ విజయం సాధ్యమైంది” అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రజాదరణను తక్కువ చేసి చూపడం అక్బరుద్దీన్‌కు తగదని ఆయన హితవు పలికారు.
Samsung 55inch TV Offer: రూ.81,900 టీవీ ఇప్పుడు కేవలం రూ.45,990లకే.! టాప్ ఫీచర్స్ కూడా..!
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనను చూసి ఓటేశారని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజా రంజక పాలన చూసి ఓటర్లు పట్టం కట్టారని, తమ గెలుపును మరొకరి ఖాతాలో వేయాలని చూడటం ముమ్మాటికీ పొరపాటని ఆయన వ్యాఖ్యానించారు. తామే గెలిపించామని ఎవరైనా భ్రమల్లో ఉంటే అవి వదిలేసుకోవాలని అక్బరుద్దీన్‌నుద్దేశించి మంత్రి చురకలు అంటించారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తమ ఉనికిని చాటుకోవడానికి, ఓటర్లను ఆకర్షించడానికే ఎంఐఎం నేతలు ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఇలాంటి వ్యాఖ్యలకు మున్సిపల్ ఎన్నికల్లోనే సరైన సమాధానం చెబుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం మద్దతు లేకుండానే కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా తన సత్తా చాటుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
-
OTR: జగ్గారెడ్డి కమిషన్ రిపోర్ట్‌లో ఏముంది..?
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!