Fire Break : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారం గ్రామంలో ఉన్న SR ల్యాబ్ కెమికల్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కొద్ది సేపట్లోనే పెద్ద ఎత్తున దగ్ధమయ్యాయి. పరిశ్రమ అంతటా మంటలు వ్యాపించడంతో ఉద్యోగులు భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు. మంటలు ఎగసిపడుతున్న సమాచారంతో ఫైర్ సిబ్బంది తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని ఫైర్ ఇంజన్ల సాయంతో అగ్నిమాపన చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Shocking murder: సహస్ర ఇంటిలోకి మైనర్ కిల్లర్ ఎందుకు వెళ్లాడు?
ఇక పరిశ్రమలోని రసాయనాలు కారణంగా మంటలు మరింత తీవ్రరూపం దాల్చినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. అయితే ఆస్తి నష్టం పెద్దఎత్తున జరిగే అవకాశముందని అంచనా. ప్రమాదానికి గల కారణం స్పష్టంగా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక రసాయనాల అవాంఛిత రియాక్షనా? అనేది తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభమైంది. స్థానికులు ఆందోళన చెందుతుండగా, పోలీసులు పరిశ్రమ వద్ద మోహరించి పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టారు.