Train Speed Increases: ఇక రైలు బండి మరింత స్పీడ్‌గా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైలు బండి.. దాని స్పీడ్‌పై గతంలోనే అనేక పాటలు వచ్చాయి… కానీ, కాల క్రమంగా రైళ్ల రూపం మారిపోయింది.. వేగం పెరిగింది.. ఇక, జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లేందుకు సిద్ధం అయ్యాయి రైళ్లు.. నేటి నుంచి దక్షిణ మధ్య రైల్వేలో రైళ్ల వేగం మరింత పెరగనుంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి తర్వాత తొలిసారిగా పట్టాలపై రైళ్లు మరింత స్పీడ్‌తో దూసుకెళ్లనున్నాయి. ట్రాక్ అప్‌గ్రెడేషన్ పనులు పూర్తి కావడంతో ఈ రోజు నుంచి మూడు డివిజన్ల పరిధిలో ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్ల వేగ పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు.. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో.. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్ ఉండగా.. ఆయా డివిజన్లలో 285 రైళ్లు నడుస్తున్నాయి.. అయితే, ఇవాళ్టి నుంచి సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్లు డివిజన్లలో ఎక్కువ సెక్షన్లలో గంటకు 130 కిలోమీటర్ల స్పీడ్‌తో రైళ్లను నడిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది రైల్వేకి మరింత ఉపయోగపడుతుందని చెబుతున్నారు అధికారులు.
Read Also: Astrology : సెప్టెంబర్12, సోమవారం దినఫలాలు
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
ఈ రోజు నుంచి సికింద్రాబాద్ డివిజన్లోని సికింద్రాబాద్- కాజీపేట-బల్హర్షా, కాజీపేట్-కొండపల్లి… విజయవాడ డివిజన్లోని కొండపల్లి- విజయవాడ-గూడూరు.. గుంతకల్ డివిజన్లోని రేణిగుంట- గుంతకల్- వాడి సెక్షన్లలో రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్లనున్నాయి.. ప్యాసింజర్ రైళ్లతోపాటు గూడ్స్ రైళ్ల సగటు వేగం కూడా పెరగనుంది.. ఇప్పటి వరకు గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగ పరిమితి ఉండగా.. ఇవాళ్టి నుంచి అది 130కి పెరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.. ఇక, సెక్షనల్ స్పీడ్‌ని 130 కిలోమీటర్లకు పెంచడంలో సంబంధిత పనులను పూర్తి చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న అధికారులు, సిబ్బందిని అభినందించారు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేజేజర్ అరుణ్ కుమార్.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!