“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwambhara: వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి రెండు చిత్రాలు ఒకదానితో ఒకటి తలపడేలా ఉన్నాయా? ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఇవే ప్రశ్నలు హాట్ టాపిక్‌గా మారాయి. చిరంజీవి నటిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’తో పాటు, ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాకా’ కూడా వచ్చే పండగ సీజన్లో పోటీకి దిగే పరిస్థితులు కనిపిస్తుండటం అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిరంజీవి డ్యూయల్ షేడ్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కాకా’ ఇప్పటికే సంక్రాంతి బెర్త్‌ను ఖరారు చేసుకుంది. జనవరి 13న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు తనయగా అనస్వర రాజన్ అలరించనున్నారు. అతి త్వరలోనే ఫస్ట్ సింగిల్ వదలడానికి మేకర్స్ రంగం సిద్ధం చేశారు. మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ దృశ్యకావ్యం ‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై ఇంకా ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్లు త్రిష, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. ఈ పాన్-ఇండియా మూవీకి గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ పనులే అత్యంత కీలకంగా మారాయి. ఈ మూవీ నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యం కావడంతో సినిమా రిలీజ్‌పై రోజుకో వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
ఈ సందిగ్ధ సమయాన ‘విశ్వంభర’ డైరెక్టర్ వశిష్ట పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు సినీ ప్రియుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. శివుని ప్రవచనానికి సంబంధించిన ఓ వీడియోను ఆయన తన షోషల్ అకౌంట్లో షేర్ చేస్తూ.. ‘‘శ్వాస నాది, శాసనం నీది.. ఆశ నాది, పాశం నీది.. ఆత్మ నాది, ఆట నీది.. ఎంత మాయగాడివయ్యా! ఇందుకేనా నిన్ను ‘విశ్వంభరుడు’ అని పిలిచేది?’’ అంటూ రాసుకొచ్చారు. ఈ ఆధ్యాత్మిక క్యాప్షన్ వెనుక సినిమా రిలీజ్ వాయిదా పడుతుందన్న ఆవేదన ఉందా? లేక అనుకున్న సమయానికే రప్పించేలా దైవంపై భారం వేశారా? అనే చర్చలు స్టార్ట్ అయ్యాయి. మెగాస్టార్ ఒకే సీజన్లో తన రెండు సినిమాల మధ్యే పోటీకి ఓకే అంటారా.. లేక ‘విశ్వంభర’ మరో సరికొత్త డేట్‌కు మారుతుందా అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Also Read
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- AA 23 : అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
- DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా 'డిగ్గర్'
- Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
శ్వాస నాది, శాసనం నీది
ఆశ నాది, పాశం నీది,
ఆత్మ నాది, ఆట నీది…
ఎంత మాయగాడివయ్యా!
ఓం నమః శివాయ!!!ఇందుకేనా నిన్ను “విశ్వంభరుడు” అని పిలిచేది?!
సర్వం శివం.. ఓం నమః శివాయ !! pic.twitter.com/cXjVOj5YeV
— Vassishta (@DirVassishta) September 18, 2026
తాజావార్తలు
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!