Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన మివీ తన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ‘Mivi One 5G’ని మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ నెల 24న అధికారికంగా లాంచ్ కానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన పలు ఆసక్తికర వివరాలను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ వేదికగా విక్రయించబడే ఈ ఫోన్ ధర రూ. 15,000 లోపు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బ్లూ, గ్రీన్, పర్పుల్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఇది లభించనుంది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ చిప్సెట్తో వస్తున్న ఈ ఫోన్ పనితీరుపై వినియోగదారుల్లో భారీ అంచనాలున్నాయి.
డిజైన్ పరంగా.. ఫోన్ వెనుకభాగంలో వర్టికల్ పొజిషన్లో పిల్ షేప్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో కూడిన డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ ఇవ్వగా.. పక్కనే ఎల్ఈడీ ఫ్లాష్ అమర్చారు. అయితే డిస్ప్లే, బ్యాటరీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
Also Read
ఫోన్ లాంచ్‌తో పాటు కస్టమర్లకు అందించే ఆఫ్టర్-సేల్స్ సర్వీస్‌పై మివీ ప్రత్యేక దృష్టి సారించింది. ‘మివీ కేర్+’ పేరుతో ఉచిత సర్వీస్ ప్యాకేజీని ప్రకటించింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 500లకు పైగా సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రత్యేకంగా ‘Replaced, not repaired’ పాలసీని పరిచయం చేయడం ఈ ఫోన్ ప్రధాన విశేషం. దీని ప్రకారం ఫోన్ నచ్చకపోతే లేదా సమస్య వస్తే రిపేర్ చేయడం కుదరదు, నేరుగా 7 రోజుల్లోపు రీప్లేస్మెంట్ పొందవచ్చు. అలాగే 1 సంవత్సరం వారంటీ, సర్వీస్ రిక్వెస్ట్‌లను ట్రాక్ చేయడానికి ప్రత్యేక యాప్, డోర్‌స్టెప్ పిక్అప్ అండ్ డెలివరీ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. బడ్జెట్ ధరలో లభించే ఈ ఫీచర్లు మార్కెట్లో పోటీని పెంచే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!