Site icon NTV Telugu

Telangana Congress: నేడు నగరానికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ

Soniyagandhi

Soniyagandhi

Telangana Congress: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ నేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఒకె ఫ్లైట్ లో ఉదయం 9:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్న సోనియా, రాహుల్, ప్రియాంక హైదరాబాద్ చేరుకుంటారని గాందీభవన్ వర్గాలు తెలిపాయి. ఉదయం 07:20 గంటలకు UK-829 విమానంలో ఢిల్లి విమానాశ్రయం నుండి బయలుదేరి 9:30 గంటలకు శంషాబాద్ కు రానున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా తాజ్‌కృష్ణా హోటల్‌కు చేరుకుంటారని, కొంత విశ్రాంతి అనంతరం ఎల్‌బీ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించారు. మరోవేపు రేవంత్ ప్రమాణ స్వీకారం కార్యక్రమముకు హాజరు అవుతున్న కర్ణాటక సిఎం సిద్ధి రామయ్య రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయంకు సిద్ధైరమయ్య చేరుకుని, అక్కడి నుంచి నేరుగా LB స్టేడియంకి కర్ణాటక సిఎం చేరుకుంటారు.

Read also: Gold Price Today : గుడ్ న్యూస్..వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?

సీఎల్పీ నేతగా ఎన్నికైన తర్వాత మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన రేవంత్.. బుధవారమంతా బిజీబిజీగా గడిపారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హర్యానా ఎంపీ దీపేందర్ సింగ్ తదితరులతో పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఖర్గే వేర్వేరుగా సమావేశమయ్యారు. గురువారం జరిగే ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావాలని వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. తెల్లవారుజామున ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు యమునా బ్లాక్‌లోని రేవంత్ నివాసానికి వచ్చి కలిశారు. ఇరవై నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. చర్చలు బహిర్గతం కాలేదు.

Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

ప్రజా ప్రభుత్వం రాబోతోందంటూ ఖర్గే, రాహుల్‌ల ట్వీట్లు
బుధవారం ఢిల్లీలో రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలను ఖర్గే, రాహుల్ ట్వీట్ చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం రాబోతోందని పేర్కొన్నారు. ప్రజా తెలంగాణ కోసం కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. తాము ఇచ్చిన ఆరు హామీలను కచ్చితంగా అమలు చేస్తామని ఖర్గే ప్రకటించగా, రేవంత్ నాయకత్వంలో హామీలన్నీ నెరవేరుస్తామని రాహుల్ అన్నారు. ప్రముఖులతో సమావేశమైన అనంతరం రేవంత్ బుధవారం రాత్రి 10:20 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు సీఎస్, డీజీపీ, ఇతర అధికారులు, కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రేవంత్ నేరుగా హోటల్ ఎల్లా చేరుకున్నారు.
Revanth Reddy: ఇవాళ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం.. 11 మంది మంత్రులు సైతం..

Exit mobile version