రాజ్యసభ మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి అనారోగ్యంతో ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. సిద్దిపేట జిల్లా చిత్తాపూర్‌కు చెందిన ఆయన ప్రస్తుత వయస్సు 92 సంవత్సరాలు. మొదటి తరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో రామచంద్రారెడ్డి తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు.