Kishan Reddy: హైదరాబాద్ లోని బషీర్ బాగ్ అమ్మవారి ఆలయంలో స్వచ్ఛత కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొరు. ఇవాళ ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాలు స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు బషీర్ బాగ్ అమ్మవారి ఆలయంలో కిషన్ రెడ్డి ఆలయాల స్వచ్ఛత కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఉదయం 11 గంటలకు గౌరవ ఫిజి ఉప ప్రధానమంత్రి, పర్యాటక, పౌర విమానయాన శాఖ మంత్రి విలియమ్ గవోకాతో బంజారాహిల్స్ తాజ్ కృష్ణ ద్వైపాక్షిక చర్యల్లో పాల్గొంటారు.
Read also: Pakistan : కిలో ఉల్లి 250రూపాయలు.. ఎక్కడంటే ?
‘మన సంకల్పం.. వికసిత్ భారత్’ అంటూ ప్రజలకు ప్రతిజ్ఞ చేశారు. వికసత్ భారత్ లో భాగంగా.. నిన్న కాచిగూడ, నింబోలి అడ్డాలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రం చేపట్టిన వికాసిత్ భారత్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ఈ స్పందన చూస్తుంటే మోదీ మూడోసారి ప్రధాని అవుతారని అనిపిస్తోందని అన్నారు. ప్రతి ఇంటికి మూత్రశాలలు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన ఘనత కేంద్రంలోని బీజేపీకే దక్కుతుందన్నారు. కేంద్రం నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం, కరువు పనులు తదితర కార్యక్రమాలను ప్రజలకు చెప్పడం లేదన్నారు.
అందుకే తమ ప్రభుత్వం ప్రజల కోసం ఎలాంటి పథకాలు తీసుకొచ్చిందో తెలుసుకునేందుకు వికాసిత్ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బీజేపీని ఓడించే శక్తి దేశంలో ఏ పార్టీ లేదని, రానున్న ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధించి కేంద్రంలో అధికారం చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఏడాది శంషాబాద్ మండలం చిన్న గోల్కొండలో ‘మా సంకల్పం అభివృద్ధి చెందిన భారత్’ పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించి, బ్రోచర్లను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
India Most Polluted Cities: భారతదేశంలో అత్యంత కాలుష్య నగరాలు ఏవో తెలుసా?