Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూ ప్రకంపనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake : భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవులు వరుస భూ ప్రకంపనాలతో వణికిపోయాయి. ఆదివారం మధ్యాహ్నం 2:59 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా నష్టం జరిగినట్లు నివేదిక లేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. భూకంపం 10 కి.మీ లోతులో సంభవించింది. ఏప్రిల్ 6 న అండమాన్, నికోబార్ దీవులలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. పోర్ట్ బ్లెయిర్‌కు 140 కి.మీ దూరంలో భూకంపం సంభవించింది. రాత్రి 10:47 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చింది.
Read Also: GT vs KKR: పోరాడుతున్న కోల్‌కతా.. 10 ఓవర్లలో స్కోరు వివరాలు ఇలా..
Also Read
ఉత్తర భారతదేశంలో గత నెలలో బలమైన ప్రకంపనలు సంభవించాయి. అంతకుముందు మార్చి నెలలో ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత ఉత్తర భారతదేశం అంతటా చాలా నిమిషాల పాటు బలమైన ప్రకంపనలు వచ్చాయి. నేపాల్ రాజధాని ఖాట్మండ్ లో శనివారం తెల్లవారుజామున 3.04 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. 25కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదైందని అధికారులు ప్రకటించారు. గత రెండు నెల కిత్రం (ఫిబ్రవరి)లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. గతంలో సంభవించిన భూకంపం వల్ల నేపాల్ దేశంలో భారీ నష్టం సంభవించింది.
Earthquake of Magnitude:4.1, Occurred on 09-04-2023, 14:59:46 IST, Lat: 9.01 & Long: 94.18, Depth: 10 Km , Nicobar island, India for more information Download the BhooKamp App https://t.co/KVJDtTVrhK @Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @DDNational pic.twitter.com/K5HjqNtHF1
— National Center for Seismology (@NCS_Earthquake) April 9, 2023
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!