Bengaluru: బెంగళూరులో తెలంగాణ సాఫ్ట్‌వేర్ జంట ఆత్మహత్య.. కారణమిదేనా?
- బెంగళూరులో ఘోర విషాదం
- తెలంగాణ సాఫ్ట్‌వేర్ జంట ఆత్మహత్య
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులో ఘోర విషాదం చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ జంట ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో సిద్దిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భాను చందర్ రెడ్డి కుంట (32), బీబీ షాజియా సిరాజ్ (31) భార్యాభర్తలు. బీబీ షాజియా సిరాజ్ ప్రముఖ టెక్ కంపెనీ ఐబీఎంలో పని చేస్తోంది. అయితే సోమవారం అపార్ట్‌మెంట్‌లో ఒక గదిలో భాను చందర్ రెడ్డి కుంట ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. షాజియా సిరాజ్ ఇంటికొచ్చి చూడగా గది తలుపు తాళం వేసి ఉంది. ఎంత సేపు పిలిచినా స్పందన కరవైంది. దీంతో ఇరుగుపొరుగు, భద్రతా సిబ్బందిని పిలిచింది. దీంతో వారు తలుపు బద్దలు కొట్టగా భాను చందర్ రెడ్డి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. విగతజీవిగా పడి ఉన్నాడు. దీంతో ఆమె ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైంది. క్షణాల వ్యవధిలోనే ఆమె కూడా 17వ అంతస్తు నుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలతో సంఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయింది. ఒకేసారి సాఫ్ట్‌వేర్ దంపతులు ప్రాణాలు కోల్పోవడంతో అపార్ట్‌మెంట్‌లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్‌కు హరీష్ సవాల్.!
- Siddipet : యాప్‌తో బయటపడిన యూరియా మాఫియా..!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
ఇది కూడా చదవండి: Inter Result: అంతులేని విషాదం.. ఇంటర్ ఫలితాలు విడుదల.. ప్రాణాలతో లేని ‘టాపర్’
ఇక దంపతుల మరణ వార్త తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు బెంగళూరుకు వెళ్లారు. ఇరు కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అసహజ మరణాలుగా వేర్వేరు ఫిర్యాదులు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టానికి తరలించారు. అయితే ఆరోగ్య సమస్యలు, ఇద్దరి మధ్య సంబంధాల సమస్యలు, మానసిక క్షోభ వంటి అనేక కోణాల్లో మరణాలు జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: IPS Couple Wedding: అప్పగింతల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన ఐపీఎస్ పెళ్లికూతురు అన్షికా వర్మ
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!