SI Missing Case: భిక్కనూరులో పనిచేస్తున్న సబ్‌ఇన్‌స్పెక్టర్ సాయికుమార్, బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, బీబీపేటకు చెందిన నిఖిల్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, బీబీపేటకు చెందిన నిఖిల్ మృతదేహాలు లభ్యం కాగా.. భిక్కునూరు ఎస్సై సాయికుమార్ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది.
Read also: Joe Biden: జో బైడెన్ కీలక నిర్ణయం.. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని వెల్లడి..
నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎస్ఐ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటంతో పోలీసుల్లో టెన్షన్ పెరుగుతుంది. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువుగట్టు వద్ద ఎస్.ఐ. సాయికుమార్ కారు , పాదరక్షల గుర్తించారు పోలీసులు. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేపట్టారు. నిన్న రాత్రి నుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే చెరువులో బీబీపెట్ కానిస్టేబుల్ శృతి, సహకార సంఘం కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. ముగ్గురు ఒకేసారి చెరువు గట్టుకు వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. శృతి దీ ఆత్మహత్య కాదు హత్య అని బంధువులు ఆరోపిస్తున్నారు.
Read also: Vaikunta Dwara Darshan Tokens: సామాన్యులకు అధిక ప్రాధాన్యం: టీటీడీ ఈవో
సబ్ ఇన్ స్పెక్టర్, మహిళా కానిస్టేబుల్‌తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా? వారి మధ్య గొడవలు ఏమిటి? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఎవరికీ అంతుపట్టడం లేదు. సబ్ ఇన్‌స్పెక్టర్ సాయికుమార్ గతంలో బీబీపేట పోలీస్ స్టేషన్‌లో పనిచేశారు. శృతి కూడా అక్కడ కానిస్టేబుల్‌గా పని చేసింది. ఆమె ఇప్పటికీ అక్కడే పనిచేస్తోంది. బీబీపేటకు చెందిన నిఖిల్ సొసైటీలో ఆపరేటర్‌గా పనిచేస్తూ కంప్యూటర్ రిపేర్ చేస్తుంటాడు. పోలీస్ స్టేషన్‌లో కంప్యూటర్లకు ఏదైనా సమస్య ఉంటే నిఖిల్ వచ్చి పరిష్కరించేవాడని చెబుతున్నారు. అయితే ఈ ముగ్గురి మధ్య గొడవలు బయటకు రావడం లేదు. మృతదేహాలు లభ్యమైన తర్వాత పోలీసు అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడిస్తే గానీ.. వీరి మృతిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.
CPI Narayana: సినీ ప్రముఖులతో సీఎం సమావేశం.. సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు..