Tiger Tension: సిద్దిపేట జిల్లాలో గత కొన్ని రోజులుగా పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లా సరిహద్దుల మీదుగా సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించిన ఈ పులి, ప్రస్తుతం అటవీ శివారు గ్రామాలను హడలెత్తిస్తోంది. ముఖ్యంగా ఇర్కోడ్ అటవీ ప్రాంతంలో ఒక అడవిపందిని వేటాడి తిన్న ఆనవాళ్లను అధికారులు గుర్తించడంతో, పులి సంచారంపై స్పష్టత వచ్చింది. ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల చీఫ్ కన్జర్వేటర్ రామలింగం పులి సంచరిస్తున్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. పులిని సురక్షితంగా బంధించేందుకు లేదా అడవిలోకి పంపేందుకు అటవీ శాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని ప్రసిద్ధ తడోబా టైగర్ రిజర్వ్ నిపుణులు జిల్లా అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
Walking for Weight Loss: శరీరంలో కొవ్వు పేరుకుపోతుందా.. ఇలా చేస్తే వెంటనే కరిగిపోతుంది..
ప్రస్తుతం అడవిలో పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా, సుమారు 45 మంది అటవీ శాఖ సిబ్బంది రేయింబవళ్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పులి జాడను కనిపెట్టేందుకు కామారెడ్డి జిల్లాలో 20, సిద్దిపేట జిల్లాలోని తొగుట అటవీ ప్రాంతంలో 15 ట్రాప్ కెమెరాలను అమర్చారు. ముఖ్యంగా తొగుట మండలంలోని గోవర్ధనగిరి, కొండాపూర్, గుడికందుల, వర్ధరాజ్ పల్లి గ్రామ శివారుల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు పొలాల వద్దకు ఉదయం 8 గంటల తర్వాతే వెళ్లాలని, సాయంత్రం 6 గంటల లోపే తిరిగి ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. అటవీ శాఖా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పులిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
Kanaka Durga Temple: దుర్గమ్మ భక్తులకు అలర్ట్… ఇంద్రకీలాద్రిపై కీలక మార్పులు..