Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pesara Laddu Recipe: పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వారికి రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అంతేకాకుండా బయటి చిరుతిండి తగ్గించడానికి ఇంట్లోనే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అందిస్తే అది వారికి కూడా మేలు అవుతుంది. అలాంటి వారికోసమే గ్రీన్ మూంగ్ దాల్ (పెసర్లు)తో చేసే ఈ లడ్డూలు మంచి ఎంపిక. పెసర్లలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉండటంతో పిల్లల ఎదుగుదలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. బెల్లం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి కలిపి చేసే ఈ లడ్డూలు రుచితో పాటు పోషకాలను కూడా అందిస్తాయి. ముఖ్యంగా వీటిని ఒక నెల వరకు నిల్వ చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:
* పెసర్లు – 1 కప్పు
* బెల్లం – ½ కప్పు (తీపి ఎక్కువ కావాలంటే 1 కప్పు)
* నీరు – అవసరమైనంత
* నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు
* బాదం – 12
* జీడిపప్పు – 10
* కిస్మిస్ – కొద్దిగా
* యాలకుల పొడి – 1 టేబుల్ స్పూన్
* పాలు – 3 టేబుల్ స్పూన్లు
Also Read
- AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం!
- Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 5 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధం.!
- 200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
- RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
తయారీ విధానం:
ముందుగా ఒక కప్పు పెసర్లను తీసుకుని రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగి నీరు పూర్తిగా వడకట్టాలి. తర్వాత ఒక వెడల్పాటి కడాయిలో వేసి మొదట హై ఫ్లేమ్‌పై నీరు పూర్తిగా ఆవిరయ్యే వరకు వేయించాలి. ఆ తర్వాత చిన్న మంటపై పెసర్లు మంచి సువాసన వచ్చి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి.
ఇప్పుడు మరో పాత్రలో బెల్లం, కొద్దిగా నీరు వేసి కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టి మళ్లీ స్టవ్‌పై ఉంచి రెండు పొంగులు వచ్చే వరకు మాత్రమే వేడి చేయాలి. పాకం తయారు చేయాల్సిన అవసరం లేదు. అనంతరం చల్లారనివ్వాలి. చల్లారిన పెసర్లను మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే వడకట్టుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసి బాదం, జీడిపప్పు, కిస్మిస్ను వేయించి పక్కన పెట్టాలి.
అదే కడాయిలో పెసరపిండి వేసి చిన్న మంటపై నెయ్యి మొత్తం పిండికి పట్టేలా, మంచి సువాసన వచ్చే వరకు సుమారు 15 నుంచి 20 నిమిషాలు వేయించాలి. అవసరమైతే మరికొంత నెయ్యి జోడించవచ్చు. పెసరపిండి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. తర్వాత చల్లారిన బెల్లం పాకాన్ని కొద్దికొద్దిగా పోస్తూ బాగా కలపాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతులతో లడ్డూలుగా చుట్టుకోవాలి.
ఒకవేళ మిశ్రమం చల్లారిపోయి లడ్డూలు చుట్టడానికి కష్టంగా అనిపిస్తే.. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలు వేసి మళ్లీ కలిపి లడ్డూలు తయారు చేసుకోవచ్చు. ఈ పెసర లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే ఒక నెల వరకు తాజాగా ఉంటాయి. పిల్లలకు సాయంత్రం స్నాక్‌గా లేదా ఉదయం అల్పాహారంతో పాటు ఇవ్వడానికి ఇవి బెస్ట్ ఛాయిస్.
తాజావార్తలు
-
AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం!
-
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 5 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధం.!
-
Lalit Modi Becomes British Citizen: లలిత్ మోడీకి బ్రిటిష్ పౌరసత్వం.. ఇక యూకేనే శాశ్వత నివాసం!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
Gaza Conflict: ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో.. హమాస్ కమాండర్ సమీర్ అబూ యూనిస్ హతం
ట్రెండింగ్
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి