Tiger Tension : కొమురంభీం జిల్లాలో పులి సంచారం స్థానికులలో భయాన్ని పెంచుతోంది. తాజాగా, తిర్యాని మండలంలో పులి దాడి జరిగింది. ఈ దాడిలో రెండు పశువులు చనిపోయాయి. గోండు గూడ, తోయగూడ గ్రామాలకు చెందిన ఆవుల మీద పులి దాడి చేసింది. కుర్పేత కర్ణ, మడావి అంజనా బాయి లకు చెందిన ఆవులపై ఈ దాడి జరిగినట్టు నిర్ధారణ అయ్యింది. అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలం పరిశీలించారు. పులి పాద ముద్రలు గుర్తించారు. పులి…
రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్‌లో ప్రసిద్ధ ఆడపులి "ఆరోహెడ్" మరణించింది. ఆరోహెడ్ వయసు దాదాపు 11 సంవత్సరాలు. ఇది ఫిబ్రవరి 2014లో జన్మించిందని అధికారులు తెలిపారు. ఆరోహెడ్, రణథంబోర్ పార్క్‌లోని ప్రసిద్ధ ఆడపులి 'మచ్లి' కుటుంబానికి చెందినది. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆరోహెడ్ బ్రెయిన్ ట్యూమర్ కారణంగా మరణించింది.