55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
itel Power 451 Launch: బడ్జెట్ ఫీచర్ ఫోన్ విభాగంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఐటెల్ (itel) మరో కొత్త ఫీచర్ ఫోన్ ను తీసుకొచ్చింది. కంపెనీ తాజాగా భారతదేశంలో itel Power 451 ఫీచర్ ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. తక్కువ ధరలోనే AI ఆధారిత ఫీచర్లు, దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్ అందించడం ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్లో 2.4 అంగుళాల డిస్ప్లేను అందించారు. బ్లూ, గ్రీన్, పర్పుల్, బ్లాక్ రంగుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. భద్రత కోసం బాక్స్‌లో ఉచిత ప్రొటెక్టివ్ బ్యాక్ కవర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.
AI కాల్ నాయిస్ రిడక్షన్:
ఐటెల్ పవర్ 451లో AI ఎన్విరాన్మెంటల్ నాయిస్ కాన్సలేషన్ (AI-ENC) టెక్నాలజీని పొందుపరిచారు. ఈ ఫీచర్ కారణంగా మార్కెట్లు, ట్రాఫిక్ ప్రాంతాలు లేదా ఇతర శబ్దభరిత వాతావరణాల్లో కూడా కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తగ్గి స్పష్టమైన వాయిస్ వినిపిస్తుంది. ఫీచర్ ఫోన్ విభాగంలో AI ఆధారిత ఈ సౌకర్యం వినియోగదారులకు మెరుగైన కమ్యూనికేషన్ అనుభవాన్ని అందించనుంది.
Also Read
- Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
- Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
బ్యాటరీ:
ఈ ఫోన్లో 2500mAh సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. సూపర్ బ్యాటరీ మోడ్ సాయంతో గరిష్టంగా 55 రోజుల స్టాండ్‌బై టైమ్ అందుతుందని కంపెనీ పేర్కొంది. అలాగే ఆధునిక వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందించారు.
ధర:
ఐటెల్ పవర్ 451 ధర కేవలం రూ.1,699గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ ఇప్పటికే విక్రయాలకు అందుబాటులో ఉంది. ఇందులో తయారీ లోపాలు ఎదురైతే ఒక సంవత్సరం కౌంటర్ రీప్లేస్మెంట్ వారంటీని కూడా కంపెనీ ప్రకటించింది.

తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!