Tiger Tension: సిద్దిపేట జిల్లాలో గత కొన్ని రోజులుగా పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లా సరిహద్దుల మీదుగా సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించిన ఈ పులి, ప్రస్తుతం అటవీ శివారు గ్రామాలను హడలెత్తిస్తోంది. ముఖ్యంగా ఇర్కోడ్ అటవీ ప్రాంతంలో ఒక అడవిపందిని వేటాడి తిన్న ఆనవాళ్లను అధికారులు గుర్తించడంతో, పులి సంచారంపై స్పష్టత వచ్చింది. ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల చీఫ్ కన్జర్వేటర్ రామలింగం పులి సంచరిస్తున్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు.…