Mohammad Shabbir Ali: కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి మహిళకు 60 ఏళ్ల లోపు ఉన్న వారందరికీ 2500 ఆర్థిక సహాయం చేస్తామని అర్బన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేటలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలే అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 400 సిలిండర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1200 వచ్చిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయంలోనూ 108 ఆదుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ కి 10లక్షలు అమలు చేస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ 5 వందలకు అందిస్తామన్నారు. యూనివర్సిటీలో ఉద్యోగాల కోసం తెలంగాణ కోసం అమరులైతే ఆదుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి మహిళకు 60 ఏళ్ల లోపు ఉన్న వారందరికీ 2500 ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కడ ప్రయాణం చేసిన వారందరికీ ఫ్రీ అని తెలిపారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరారు.
Read also: Pushpa 2: పుష్ప 2 హైలెట్ సీన్ లీక్.. ఎంత పని చేశావ్ దేవి..
బీసీ బంధు, మైనార్టీ బంధు తదితర ప్రభుత్వ పథకాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. ఎమ్మెల్యేల ప్రమేయంపై కేసీఆర్ మందలించారని మహ్మద్ అలీ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ఆందోళనలను హైలైట్ చేస్తూ, షబ్బీర్ అలీ నగరం యొక్క దిగజారుతున్న పరిస్థితులను ఎత్తి చూపారు. డ్రైనేజీ సమస్యతో పాటు దోమల బెడదతో నగరవాసులకు అనారోగ్య సమస్యలు మరింత పెరిగాయన్నారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటు వేసి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చెబుతున్న అభివృద్దికి విరుద్ధంగా నగరం వాగ్దానం చేసిన ప్రగతికి నోచుకోలేదని షబ్బీర్ అలీ వాదించారు. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై పలు విమర్శలు చేశారు. దశాబ్దాల కేంద్ర ప్రభుత్వ పాలనను ప్రశ్నించిన షబ్బీర్ అలీ.. అదానీ, అంబానీలను ఉదాహరణగా చూపుతూ అభివృద్ధిని కోరుకునే కొద్దిమందికే లబ్ధి చేకూర్చారన్నారు. ప్రతి ఒక్కరి అభివృద్ధి, ప్రగతి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తామని, అన్ని వర్గాల ప్రజలు, ప్రాంతాల అభివృద్ధికి భరోసా కల్పిస్తామని మరోసారి స్పష్టం చేశారు.
Malreddy Ranga Reddy: తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్సే