ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ రేంజ్ ను పుష్ప సినిమా పూర్తిగా మార్చివేసింది.. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. దర్శకుడు సుకుమార్ పీరియాడిక్ క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందించాడు. పుష్ప ప్రకటన సమయంలో పాన్ ఇండియా ఆలోచన లేదు.. షూటింగ్ మొదలయ్యాక రెండు భాగాలుగా ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అనుకున్నట్లుగానే అన్ని ఏరియాల్లో భారీ హిట్ ను అందుకుంది.. ప్రపంచవ్యాప్తంగా రూ.360 కోట్లకు పైగా వసూల్ చేసింది..
ప్రస్తుతం పార్ట్ 2 ను తెరకేక్కిస్తున్నారు.. మొదటి పార్ట్ కన్నా భారీ యాక్షన్ తో తెరకేక్కిస్తున్నారు.. ఇప్పుడు పుష్ప ది రూల్ బడ్జెట్ రూ. 350 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. చిత్రీకరణ దశలో ఉన్న పుష్ప 2 గురించి మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని కీలక విషయాలు లీక్ చేశాడు. సినిమా స్క్రీన్ ప్లే ఉత్కంఠ రేపుతుంది. ఇక జాతర నేపథ్యంలో గంగమ్మ అమ్మవారి గెటప్ లో అల్లు అర్జున్ మీద తెరకెక్కించిన సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా ఉంటాయని దేవిశ్రీ అన్నారు..
దేవి స్టోరీ లీక్ చేసాడని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తులో చర్చ చేస్తున్నారు.. గంగమ్మ గెటప్ లో అల్లు అర్జున్ లుక్ ఇప్పటికే పిచ్చ వైరల్ అయ్యింది. భారీ రెస్పాన్స్ దక్కింది. ఈ గెటప్ లో భారీ యాక్షన్ సీన్ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. తాజాగా దేవిశ్రీ చేసిన కామెంట్స్ మరింత హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నారు.. దేవి శ్రీ సంగీతాన్ని అందిస్తున్నారు..