Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- పెట్రోల్ అయిపోవడంతో కారును వదిలేసిన రాజ్‌కుమార్
- రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యాయత్నం విఫలం
- 3 ఫోన్లు, 12 సిమ్ కార్డులతో తప్పించుకునే ప్లాన్
- శ్రీశైలం, బెంగళూరు మార్గాల్లో పోలీసుల గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని నరమేధం సృష్టించిన ఉదంతంలో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీ కోసం పోలీసులు జరిపిన గాలింపు చర్యల్లో అత్యంత ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు రాత్రింబగళ్లు శ్రమిస్తున్నప్పటికీ, అతను పోలీసుల కళ్లు గప్పుతూ సాగిస్తున్న తప్పించుకునే పర్వం తీవ్ర సస్పెన్స్‌ను రేకెత్తిస్తోంది.
కారులో పెట్రోల్ ఖాళీ.. రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యాయత్నం డ్రామా
హత్యలు చేసిన అనంతరం పోలీసుల నుండి తప్పించుకోవడానికి రాజ్‌కుమార్ కారులో వేగంగా పరారయ్యాడు. అయితే, చేగూరు ప్రాంతానికి చేరుకునే సరికి కారులో పెట్రోల్ అయిపోవడంతో విధిలేక వాహనాన్ని అక్కడే వదిలేశాడు. అక్కడ నుండి కాలినడకన తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ వైపు వెళ్లాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న ఒక రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, చివరి నిమిషంలో ధైర్యం సరిపోక చచ్చేందుకు భయపడి ట్రాక్ కిందకు దూకేశాడు. ఆ తర్వాత అతను అక్కడి నుండి ఎటు వైపు వెళ్లాడు, ఎక్కడ తలదాచుకున్నాడు అనేది పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
3 ఫోన్లు.. డజనుకు పైగా సిమ్ కార్డులు
రాజ్‌కుమార్ సాధారణ నేరస్థుడిలా కాకుండా పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. అతని వద్ద సుమారు మూడు మొబైల్ ఫోన్లు, డజనుకు పైగా (12 కి పైగా) వేర్వేరు సిమ్ కార్డులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు తనను పసిగడతారనే భయంతో ప్రస్తుతం అతను ఆ ఫోన్లను, సిమ్ కార్డులను వాడటం లేదని నిర్ధారణ అయ్యింది. అయినప్పటికీ, అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడైనా ఒక సిమ్ కార్డ్ ఆన్ చేసినా వెంటనే పట్టుకోవాలనే వ్యూహంతో పోలీసులు అతనికి సంబంధించిన అన్ని నంబర్లను ప్రతిక్షణం సైబర్ సెల్ సహాయంతో ట్రాక్ చేస్తున్నారు.
శ్రీశైలంతో పాటు బెంగళూరు హైవేపై పోలీసుల గాలింపు
నిందితుడి వేట కోసం పోలీసులు ఏకంగా 12 ప్రత్యేక బృందాలను (Teams) రంగంలోకి దించారు. ఇప్పటికే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్ల సీసీటీవీ (CCTV) ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. రాజ్‌కుమార్‌కు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి రెగ్యులర్‌గా వెళ్లే అలవాటు ఉందని విచారణలో తేలడంతో.. అతను అక్కడ సాధువుల రూపంలో గానీ, భక్తుల మధ్య గానీ దాక్కునే అవకాశం ఉందని భావించి శ్రీశైలంలో ప్రత్యేక బృందాలు మోహరించాయి. దీనితో పాటు బెంగళూరు హైవే పరిసర ప్రాంతాలు , పొరుగు రాష్ట్రాలలో కూడా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!