నూతన ఐటీ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. స్టార్టప్‌లకు రూ.25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ చేస్తామని చెప్పారు. 2029 నాటికి రూ. 5 లక్షల వర్క్ స్టేషన్లు పెట్టనున్నట్లు తెలిపారు. అమరావతిలో డీప్ టెక్నాలజీ భవనం నిర్మాణం, యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీల పైనే ఉందని తెలిపారు. ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో ఉత్పన్నమయ్యే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఉండాలని సూచించారు.
హైదరాబాద్‌లో పలుచోట్ల హోటల్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. నగరంలో ఫుడ్ కల్తీ ఘటనలు చోటు చేసుకుంటుండటంతో ఈ రోజు తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, అమీర్ పేట్‌లోని ఉత్తరాస్ టిఫిన్స్, అయితే బిర్యానీ, టిబ్బ్స్ ప్రాక్టీస్, కింగ్స్ ఆఫ్ కబాబ్స్‌తో పాటు మెహదీపట్నంలోని అబ్దుల్ బాయ్స్ హాస్టల్, మధురానగర్‌లోని యూనివర్సల్ ఆల్ మాతం మండి కబాబ్స్ అండ్ బిర్యానీ సెంటర్లలో అధికారులు తనిఖీలు చేశారు.
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలంలో ఐలాపూర్ షడ్యూల్డ్ తెగ గ్రామ పంచాయితీకి చెందిన పలువురు ప్రజలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ, కుల సర్వేను బహిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మల్లెల లక్ష్మయ్య మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా.. తమ గ్రామానికి ఇంత వరకు తారు రోడ్డు నిర్మించక పోవడం దారుణమన్నారు.
నీట్ యూజీ ఫలితాలు వెలువడినప్పటి నుంచి "ఎక్స్" లో సందడి నెలకొంది. 'నీట్ పేపర్‌ని రద్దు చేయండి' అనే హ్యాష్‌ట్యాగ్ "X" (ట్విట్టర్)లో వేగంగా ట్రెండ్ అవుతోంది. ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఈ పరీక్షపై సందిగ్ధత నెలకొంది.
శనివారం బెంగాల్లో జరుగుతున్న పంచాయత్ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు బ్యాలెట్లతో జరగాలని.. ..బుల్లెట్లతో కాదని అన్నారు.