ఖమ్మం జిల్లాలో మున్నేరు వరదలో చిక్కుకున్న ఏడుగురి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. మున్నేరు వరద ఉధృతి, సహాయక చర్యలపై మంత్రి పువ్వాడని అడిగి సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు.