NTV Telugu Site icon

MP Dr. Laxman: బూతద్దం పెట్టీ వెతికినా.. మోడీకి సరి తూగే వ్యక్తి దొరకరు..

Mp Dr. Laxman

Mp Dr. Laxman

MP Dr. Laxman: బూతద్దం పెట్టీ వెతికినా.. మోడీకి సరి తూగే వ్యక్తి దొరకరని రాజ్యసభ ఎంపీ డా. లక్ష్మణ్ అన్నారు. ముషీరాబాద్ బీజేపీ యువ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. దేశం మొత్తం యూనిఫాం సివిల్ కోడ్ కోసం ఎదురు చూస్తుందన్నారు. మూడో సారి మోడీ ప్రధాని అవ్వగానే యూనిఫాం సివిల్ కోడ్ అమలు జరుగుతుందన్నారు. దేశానికి ప్రధాని ఎవరు కావాలని ఎదురు చూస్తున్న ఎన్నికలు ఇవి అన్నారు. మోడీకి సరితుగే నాయకులే లేరన్నారు. బూతద్దం పెట్టీ వెతికినా మోది కి సరి తూగే వ్యక్తి దొరకరన్నారు. దేశానికి యువతే వెన్నెముక.. ఆ యువత మొత్తం మోడీ వెంట ఉన్నారన్నారు. యువతకి అవసరమైన ఉపాధి అవకాశాలు కల్పించేది మోడీ నే అన్నారు. మోడీకి ఉన్న ముందు చూపుతో వనరులు పెట్టుబడిగా పెట్టు దేశానికి వనరులు సృష్టిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ హయంలో భారత దేశం ఆర్థికంగా ప్రపంచంలో 11 వ స్థానంలో ఉండేదన్నారు. ఇప్పుడు మోడీ హాయంలో 5 వ అతిపెద్ద ఆర్థిక దేశంగా భారత్ ఎదిగిందన్నారు.

Read also: Congress : రాయ్‌బరేలీ, అమేథీపై కాంగ్రెస్ కీలక నిర్ణయం, పరిశీలకులుగా ఇద్దరు మాజీ సీఎంలు

ముద్ర లోన్స్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించింది కూడా మోడీ నే అన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉపాధి పొందేందుకు మోడీ కృషి చేశాడన్నారు. స్టార్టప్ కంపెనీలకు తోడ్పాటుగా ఉండి యువతకు మోది సహకారం అందించాడని తెలిపారు. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధి దారుల ఖాతాలో నగదు జమ అవుతుంది అంటే అది మోడీ ముందు చూపే అన్నారు. డిజిటల్ ఇండియా కోసం మోడీ చేసిన కృషి ఫలితమే ఈ దళారీ వ్యవస్థ నుండి విముక్తి అన్నారు. కాంగ్రెస్ మత పరమైన రాజకీయాలు చేస్తుందన్నారు. గతంలో ఎప్పుడూ కూడా మతపరమైన రిజర్వేషన్లు లేకుండే అన్నారు. కాంగ్రెస్ మొదటి సారి మైనార్టీలకు రిజర్వేషన్ అందించిందన్నారు. కుల పరమైన రిజర్వేషన్లు రద్దు చేసేందుకు అప్పట్లో నెహ్రూ కూడా ప్రయత్నించారన్నారు. యువత మేల్కొని కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను తిప్పి కొట్టాలన్నారు. హైదరాబాద్ లో 70% ఓటింగ్ నమోదు అయ్యేలా చూసే బాధ్యత యువత తీసుకోవాలని తెలిపారు. సికింద్రబాద్ లో కిషన్ రెడ్డి నీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
G. Kishan Reddy: దేశానికి ప్రధాని ఎవరు కావాలి.? మోడీనా.? రాహుల్ గాంధీనా.?

Show comments