Minister Sridhar Babu: కొత్త ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. HICCలో ప్రతిష్టాత్మక 21వ బయో ఆసియా సదస్సు నేటి నుంచి ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే సదస్సులో తొలిరోజు జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ తదితర కంపెనీలను విదేశీ ప్రతినిధులు సందర్శించారు. ఈ కార్యక్రమానికి తెలంగాన సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. 100 మందికి పైగా ప్రముఖ శాస్త్రవేత్తలు, ప్రపంచ దేశాల విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బయోమెడికల్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు, వైద్యరంగంలో ఆవిష్కరణలు, వైద్య పరికరాలకు ప్రోత్సాహకాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ సమస్యలపై పరిశోధనలు చేస్తున్న విత్తన కంపెనీలకు ప్రోత్సాహకాలు, మద్దతుపై అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడనుంది.
Read also: Centrol Govt: 6 ఏళ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో అడ్మిషన్స్..
ఈ నేపథ్యంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక 21వ బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్ వేదిక అయిందన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు 40వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. కొత్త ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని అన్నారు. పారిశ్రామికవేతలకు ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త జీవ వైద్య విధానాన్ని అందుబాటులోకి తీసుకొత్సామని తెలిపారు. కేవలం పరిశ్రమల స్తాపనే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఉద్యోగాల కల్పన చేసే విధంగా పాలసీ రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని నైపుణ్య శిక్షణ కేంద్రంగా మార్చెలా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్దం చేశారని తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు… ఆయా రంగాల్లో నైపుణ్యం సాధించేలా తగిన శిక్షణ ఇచ్చేలా విధానం రూపొందిస్తున్నామన్నారు.
TS Entermediate Exam: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. ప్రతీ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు