మే నాటికి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి : రజత్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు నిర్మాణ పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి (ఇరిగేషన్) రజత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాలోని అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులను సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రెడ్డి, ఎల్ అండ్ టీ సీఈవో సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేందుకు సమావేశం నిర్వహించారు. రూ.3,480 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. ప్రాజెక్టుకు అశ్వాపురం, చెర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని 63 గ్రామాల్లో 3121.14 ఎకరాల భూమి అవసరం. ఇప్పటి వరకు 2640.39 ఎకరాల భూమిని సేకరించగా అందులో 2485.18 ఎకరాల భూమిని నీటిపారుదల శాఖకు అప్పగించారు.
పరిహారంగా రూ.112.77 కోట్లు చెల్లించామని, మరో 740 ఎకరాల భూమిని అప్పగించాల్సి ఉందని, ఇందుకుగానూ రూ.59.20 కోట్లను భూ యజమానులకు పరిహారంగా చెల్లించాల్సి ఉందన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇసుకను సమకూర్చారు. నిర్మాణ పనులకు అవసరమైన యంత్రాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. 36.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించే ప్రాజెక్టుకు 65 గేట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని రజత్ కుమార్ తెలిపారు.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
తాజావార్తలు
-
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
-
Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
-
Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
-
Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!