Bengaluru: బెంగళూర్ లోని కలాసిపాల్య బస్టాండ్‌లో పేలుడు పదర్థాలు పట్టుబడటం భయాందోళనలకు గురిచేసింది. స్థానిక పోలీసులు, ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) బస్టాండ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బస్టాండ్‌లో సమీపంలోని ప్లాస్టిక్ కవర్‌లో దాచిన ఆరు జెలిటిన్ స్టిక్స్ దొరికాయి. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పట్టుబడటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు. ఈ రెండు కేసులను ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. అందిన సమాచారం ప్రకారం పోలీసులు, ఆర్మీ పెట్రోలింగ్ బృందం జమ్మూలోని ఘరోటా ప్రాంతంలో రోడ్డు పక్కన అనుమానాస్పద వస్తువును కనుగొన్నారు. అయితే దానిని పరిశీలించగా అది పేలుడు పదార్థంగా అనుమానించారు. ఈ…
భారతదేశానికి చెందిన హైస్టీడ్ రైలు అహ్మదాబాద్-ముంబై మధ్య నడవనుంది. ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో 100 కి.మీ పొడవున వంతెన పూర్తయింది. 250 కిలోమీటర్ల మేర స్తంభాలు ఏర్పాటు చేశారు.
Bengaluru Cops seize explosives: బెంగళూరులో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. నగరంలోని చిక్కనాయకనహళ్లి ప్రాంతంలో ఓ ప్రైవేటు పాఠశాల సమీపంలో ఆపి ఉంచిన ట్రాక్టర్‌లో పేలుడు పదార్థాలను బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిలెటిన్ స్టిక్‌లు, ఎలక్ట్రికల్ డిటోనేటర్లతో సహా ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆదివారం రాత్రి చిక్కనాయకనహళ్లి ప్రాంతంలో సాధారణ పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ట్రాక్టర్‌లో పేలుడు పదార్థాలను గుర్తించినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ యజమానిపై ఎఫ్‌ఐఆర్ నమోదు…
రాయలసీమ నుంచి వికారాబాద్ కు పేలుడు పదార్థాలు తరలిస్తున్న పలువురిని దోమ పోలీసులు అదుపులో తీసుకున్నారు. జడ్చర్లలో పేలుడు పదార్థాలు అమ్మిన ఒకరిని అదుపులో తీసుకుని విచారించగా ఈఘటన వెలుగు చూసింది. కానీ వివరాలను పోలీసులు గోప్యంగా వుంచడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. అయితే వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామ శివారులో వెలుతున్న జిలెటిన్స్ స్టిక్స్ వాహనాన్ని పోలీసులు ఆపారు. అందులో .. పేలుడు పదార్థాలు వున్నట్లు గమనించిన పోలీసులు ట్రాక్టర్…