Road Accident: కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు మృతి చెందారు. బాల్కి తాలూకా నీలంమనెల్లి తండా దగ్గర కారు, DTDC కొరియర్ వాహనం ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. ఇక, ఈ ఘటనలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గానుగాపూర్ ఆలయ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Read Also: Temple Dwajasthambam: ఆలయాల్లో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో తెలుసా..? ప్రాముఖ్యత ఏంటంటే..!
అయితే, ప్రమాదంలో చనిపోయిన మృతులు నాగప్ప, నవీన్, కాశీనాథ్, నాగరాజుగా గుర్తించారు. అయితే, నాగరాజు అనే వ్యక్తి నారాయణఖేడ్ లో లెక్చరర్ గా పని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.