NTV Telugu Site icon

MP Raghunandan Rao: కేటీఆర్కి ఈడీ నోటీసులపై స్పందించిన రఘునందన్ రావు..

Raghunandanrao

Raghunandanrao

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఈడీ నోటీసులపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు.. కేటీఆర్ ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఒక్క రూపాయి ఖర్చు చేసిన అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు ఆర్బీఐకి చెప్పకుండా మన రాష్ట్ర సొమ్ముని దేశ ఫారెన్ కంపెనీల కోసం ఖర్చు పెట్టారని రఘునందన్ రావు ఆరోపించారు. అందుకే కేటీఆర్ పై ఈడీ కేసు నమోదవుతుంది.. విచారణను ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుందనితెలిపారు. ఈడీ, మోడీ, బోడి అని నోరు పారేసుకునేటప్పుడు నోరు, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిదని కేటీఆర్ కు రఘునందన్ రావు హెచ్చరించారు. గతంలో ఎమ్మెల్సీ కవిత కూడా ఇలానే మాట్లాడిందని తెలిపారు. తనను అరెస్ట్ చెయ్యి అని ట్విట్టర్‌లో పెట్టిన టిల్లు.. కేసు కాగానే కోర్టుకి వెళ్ళాడని విమర్శించారు. ధైర్యముంటే కేటీఆర్ జైలుకి వెళ్ళాలి.. జైలు లోపల ఎలా ఉంటుందో చూసి రావాలని రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Read Also: Asaduddin Owaisi: సంభాల్ మసీదుకు ఎదురుగా పోలీస్ పోస్ట్.. యోగి నిర్ణయంపై ఓవైసీ ఫైర్..

కాగా.. ఫార్ములా ఈ-కార్ కేసులో కేటీఆర్ పై ఏసీబీ, ఈడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.. ఫార్ములా ఈ-కార్ రేసులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కేసు నమోదు చేశారు. మనీలాండరింగ్, ఫెమా ఉల్లంఘన కింద ఈడీ, ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ-కార్ రేసులో ప్రమేయం ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేసింది.

Read Also: Nitish Kumar Reddy: చాలా టెన్షన్‌కు గురయ్యా.. సెంచరీ తర్వాత నితీష్ రెడ్డి తండ్రి భావోద్వేగం..