టెస్టు క్రికెట్‌లో తొలి అడుగు వేసిన నితీష్ కుమార్ రెడ్డి.. భారత్‌కు ‘ట్రబుల్‌షూటర్’ పాత్ర పోషించాడు. నాలుగో టెస్టు మూడో రోజు సెంచరీతో ఆస్ట్రేలియా విజయ ఆశలపై నీళ్లు చల్లాడు. నితీష్ చేసిన105 పరుగుల చేశాడు. వర్షం కారణంగా మూడో రోజు ఆట త్వరగా ముగిసింది. ఈ నేపథ్యంలో భారత్ తొమ్మిది వికెట్లకు 358 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరు 474 పరుగులు.. అంటే భారత్ ఇంకా 116 పరుగులు చేయాల్సి ఉంది.
నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ సందర్భంగా ఆసీస్ మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ నితీష్ తండ్రి ముత్యాల రెడ్డితో సంభాషించాడు. ఈ సందర్భంగా ముత్యాల రెడ్డి మాట్లాడుతూ.. తమ కుటుంబానికి ఇదొక ప్రత్యేకమైన రోజని సంతోషం వ్యక్తం చేశారు. తమ జీవితంలో ఈ రోజును అస్సలు మరిచిపోలేమన్నారు. “నితీష్ 14 ఏళ్ల నుంచే క్రికెట్ ఆడుతున్నాడు. చాలా బాగా ఆడటం మొదలు పెట్టాడు. నా కుమారుడు చేసిన సెంచరీని ప్రత్యక్షంగా చూడటం మాటల్లో చెప్పలేపోతున్నాను. నితీష్ 99 పరుగుల చేసి క్రీజ్‌లో ఉన్నప్పుడు ఎంతో టెన్షన్ పడ్డాను. ఒక్క వికెట్ మాత్రమే మిగిలింది. సిరాజ్ కూడా బాగా ఆడాడు. ఎట్టకేలకు నా కుమారుడు సెంచరీ సాధించడం ఆనందంగా ఉంది’’ అని భావోద్వేగానికి గుయ్యారు.
ఇదిలా ఉండగా.. భారత్ – ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది. వర్షం, బ్యాడ్ లైట్ కారణంగా మూడో రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 474 పరుగులకు అల్ అవుట్ అవ్వగా.. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. నితీష్ రెడ్డి సెంచరీతో అదరగొట్టగా.. 10 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 105 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. మరోవైపు మహ్మద్ సిరాజ్ క్రీజ్ లో ఉన్నాడు. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు కంటే భారత్ ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉంది.
The Emotions of Nitish Kumar Reddy's family and they talking about his maiden Hundred. ❤️ (RevSportz).
– NKR, THE HERO OF INDIA. 🌟🇮🇳pic.twitter.com/uSznPAxkNL
— Tanuj Singh (@ImTanujSingh) December 28, 2024