Infinix Smart 9 HD: ఇన్‌ఫినిక్స్ నుంచి మరో కొత్త ఫోన్.. రూ.6,699 మాత్రమే!
- ఇన్‌ఫినిక్స్ నుంచి మరో కొత్త ఫోన్
- ధర రూ.6,699 మాత్రమే
- ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూ ఇయర్ ఆరంభంలోనే బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ప్రీమియం ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్లు మొబైల్ లవర్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. రూ. 10 వేల కంటే తక్కువ ధరలోనే మొబైల్స్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. తాజాగా మరో మొబైల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ ఫినిక్స్ 7 వేల కంటే తక్కువ ధరలో ఇన్ ఫినిక్స్ స్మార్ట్ 9హెచ్డీ ఫోన్ ను భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. దీని ధర రూ.6,699 మాత్రమే. చౌక ధరలో స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
Infinix Smart 9 HD ఫోన్ మింట్ గ్రీన్, కోరల్ గోల్డ్, నియో టైటానియం, మెటాలిక్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఇది 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 6.7 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్ తో వస్తుంది. ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, DTS ఆడియో ప్రాసెసింగ్ ఉన్నాయి. స్మార్ట్ 9 హెచ్‌డి IP54 రేటింగ్‌తో వస్తుంది. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్డీ ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ హెలియో జీ50 ప్రాసెసర్ విత్ 2.2 హెర్ట్జ్ పీక్ క్లాక్ స్పీడ్‌తో వస్తుంది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం కానుంది.
Also Read
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
6GB RAM (3GB ఫిజికల్ + 3GB వర్చువల్), 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1TB వరకు విస్తరించవచ్చు. ఫోటోగ్రఫీ కోసం, Infinix Smart 9 HD క్వాడ్ LED, జూమ్ ఫ్లాష్‌తో కూడిన 13-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఫోన్ 5,000mAh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఇది 14.5 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్, 8.6 గంటల గేమింగ్‌ను అందించగలదని కంపెనీ తెలిపింది. Infinix Smart 9 HDలో Wi-Fi, బ్లూటూత్, USB టైప్-C, 3.5 mm హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది.
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!