Thandel: ‘తండేల్’లో చైతన్యది కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్: అల్లు అరవింద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో సక్సెస్‌ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేస్తున్న చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్‌ను వైజాగ్‌లోని రామా టాకీస్ రోడ్డులోని శ్రీరామ పిక్చర్ ప్యాలెస్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో లాంచ్ చేసింది. అభిమానుల మధ్య ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ వేడుకకు మెగా నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు హీరో అక్కినేని నాగచైతన్య హాజరయ్యారు.
Jhansi: జానీ మాస్టర్ పై కేసు గెలిచాం.. ఝాన్సీ కీలక ప్రకటన
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
నాగచైతన్యకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..‘‘మేము చాలా కష్టపడి ఈ సినిమా తీశాం. మేము ఎంత కష్టపడి తీసినా మీరు ఆదరించే స్థాయిలోనే మా ఆనందం ఉంటుంది. మీరు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. చందూ మొండేటి ఈ కథను అత్యద్భుతంగా మలిచి చాలా బాగా తీశారు. సాయిపల్లవి గారు అద్భుతంగా నటించారు. హీరో నాగచైతన్య ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో ఈ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్ చూస్తే మన గుండె కరిగిపోయేలా నటించారు. ఈ సినిమాతో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనిపించుకుంటారు.దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాలో మ్యూజిక్‌ను చించిపడేశాడు. శ్రీకాకుళంలో ఒక చిన్న ఊళ్లో జరిగిన కథను సినిమాగా తీశాం. ఉత్తరాంధ్రవాళ్లంతా ఈ సినిమా చూసి ఆనందిస్తారనే నమ్మకం ఉంది.’’ అని చెప్పారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!