Sangareddy Crime: నా కొడుకును చంపారు అందుకే చంపేసా.. బొంతపల్లిలో డబుల్ మర్డర్..
- బొంతపల్లిలో డబుల్ మర్డర్..
- వీరభద్రనగర్ కాలనిలో తల్లి కొడుకును నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్యచేసిన నాగరాజు అనే వ్యక్తి..
- మృతులు తల్లి కొడుకులు సరోజదేవి, అనిల్ యూపీకి చెందిన వారుగా గుర్తింపు..
- హంతకుడు బీహార్ రాష్ట్రనికి చెందిన వ్యక్తిగా గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy Crime: తన కొడుకు చావుకి కారకులు వీరే అంటూ నడిరోడ్డుపై తల్లి, కొడుకును ఓవ్యక్తి కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో సంచలనంగా మారింది.
అసలు ఏం జరిగింది..?
Also Read
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
- Watpally Police Station : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వట్పల్లి పోలీస్ స్టేషన్‌పై గ్రామస్తుల దాడి.!
- Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. వీరభద్రనగర్ కాలనిలో తల్లి కొడుకును నాగరాజు అనే వ్యక్తి నడిరోడ్డుపై కత్తితో పొడిచి అతికిరాతకంగా హత్యచేశాడు. మృతులు తల్లి కొడుకులు సరోజదేవి (50), అనిల్ (30) గా గుర్తింపు. వీరు యూపీకి చెందిన వారుగా గుర్తించారు. కత్తితో దాడి చేసిన వ్యక్తి నాగరాజు బీహార్ రాష్ట్రనికి చెందిన వాడిగా గుర్తించారు. పాతగొడవలే హత్యకు కారణమని స్థానికులు అంటున్నారు. ఎందుకు చంపావని స్థానికులు నాగరాజును ప్రశ్నించగా నా కొడుకును చంపారు.. అందుకే చంపాను అంటూ కోపంతో రగిలిపోయాడు. అంతేకాకుండా.. తన భార్యపై కూడా మృతులిద్దరు దాడి చేసేందుకు ఇంట్లోకి వచ్చారని అందుకే చంపానని తెలిపాడు. నా 2 సంవత్సరాల కొడుకు చావుకి కారకులు వీళ్ళే అని, వీరిపై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తుంది.
Read also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నేడు విచారణకు ఆ నేత..
అందుకే ఇవాళ వీరిద్దరిని నాగరాజు హత్య చేసినట్లు అందరి ముందు తెలిపాడు. స్థానిక సమాచారంతో పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాగరాజుని అదుపులో తీసుకుని పోలీస్టేషన్ కు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తన 2 సంవత్సరాల కొడుకుని చంపినందుకే చంపానని పోలీసుల ఎదుటే నాగరాజు తెలిపాడు. దీంతో మృతులు చెందిన అనిల్, సరోజదేవి ఎందుకు నాగరాజు కొడుకును చంపారు అనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. నాగరాజు కొడుకు చనిపోయి 2 సంవత్సరాల తరువాత మళ్లీ ఇవాళ మృతులిద్దరిని నాగరాజు కత్తితో దాడి చేసి చంపడం పై ఆరా తీస్తున్నారు. నడిరోడ్డుపై డబుల్ మర్డర్ జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
IMD Weather: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. తెలంగాణలో వర్షాలు..
తాజావార్తలు
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Harbhajan Singh: “అస్సలు భయపడొద్దు”.. వైభవ్‌ను ఈజీగా అవుట్ చేసే ‘డేంజరస్ గేమ్ ప్లాన్’ చెప్పిన హర్భజన్ సింగ్..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా ఔట్ చేయాలి?.. మాస్టర్ ప్లాన్ చెప్పిన హర్భజన్ సింగ్!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
Explainer: పశ్చిమాసియాలో కొత్త తుఫాను? యుద్ధరంగంలోకి మోస్ట్ డేంజరస్ మొహిసిన్.. అమెరికా భయపడుతుందా?
ట్రెండింగ్
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!