Sanathnagar TIMS : సనత్‌నగర్ టిమ్స్ రెడీ.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం.!
- సనత్‌నగర్ టిమ్స్‌లో ఏర్పాట్లపై మంత్రి దామోదర్ సమీక్ష
- పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు
- గుండె జబ్బులు, అవయవ మార్పిడికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా టిమ్స్
- పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanathnagar TIMS : హైదరాబాద్ సనత్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన అత్యాధునిక టిమ్స్ (TIMS) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి, ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ ఆసుపత్రిని సందర్శించి, ప్రారంభోత్సవ ఏర్పాట్లు , హాస్పిటల్ సంసిద్ధతపై అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా అందించాలన్న ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగానే ఈ సరికొత్త వైద్య సంస్థను తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అత్యాధునిక సదుపాయాల క్షేత్రస్థాయి పరిశీలన
హాస్పిటల్‌లోని A, B, C బ్లాకులను మంత్రి దామోదర్ రాజనర్సింహ స్వయంగా సందర్శించారు. అందులో భాగంగా ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్లు, ఇన్‌పేషెంట్ వార్డులు, ఎమర్జెన్సీ విభాగం, ఐసీయూలు (ICU), ఆపరేషన్ థియేటర్లను పరిశీలించారు. అలాగే సీటీ స్కాన్, ఎంఆర్ఐ (MRI), డిజిటల్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ తదితర ఆధునిక రేడియాలజీ యంత్రాల పనితీరును, డయాగ్నస్టిక్స్ ల్యాబొరేటరీలు, బ్లడ్ బ్యాంక్, మెకనైజ్డ్ ల్యాండ్రీ, సెంట్రలైజ్డ్ కిచెన్ , ఫార్మసీ విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలు, మౌలిక వసతులు, సేవల నిర్వహణ వ్యవస్థలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
Also Read
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
పెండింగ్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశం
ఆసుపత్రి అధికారికంగా ప్రారంభం కావడానికి ముందే పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల సివిల్ , సాంకేతిక పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ (R&B), ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. రోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతర నీటి సరఫరా, విద్యుత్, పారిశుధ్యం, సెక్యూరిటీ , ఫైర్ సేఫ్టీ వ్యవస్థలను అత్యున్నత ప్రమాణాలతో సిద్ధం చేయాలని సూచించారు. రోగుల రద్దీని తట్టుకునేలా ఓపీ కౌంటర్లు, హెల్ప్ డెస్క్‌లు, వెయిటింగ్ ఏరియాలను మరింత పటిష్టంగా ఏర్పాటు చేయాలన్నారు. వీటితో పాటు ఆధునిక వైద్య యంత్రాలు పూర్తిస్థాయిలో రోగులకు సేవలు అందించేలా, వాటిని నిర్వహించడానికి అవసరమైన స్పెషలిస్ట్ డాక్టర్లు, టెక్నీషియన్లు , ఇతర సహాయక సిబ్బందిని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
గుండె జబ్బులు, అవయవ మార్పిడికి ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’
సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌ను ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధుల (కార్డియాలజీ) చికిత్సలకు, అవయవ మార్పిడి (Organ Transplant) శస్త్రచికిత్సలకు ఒక ప్రముఖ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక క్యాథ్‌ల్యాబ్‌లు, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు , ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సదుపాయాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలు అందించగల అత్యుత్తమ సంస్థగా టిమ్స్ నిలవాలన్నారు. కేవలం రోగులకే కాకుండా, వారితో పాటు వచ్చే సహాయకుల కోసం ధర్మశాల (వసతి గృహం), నాణ్యమైన క్యాంటీన్లు, విశాలమైన పార్కింగ్ సదుపాయాలు , హాస్టల్ బ్లాకులను కూడా సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ దిశానిర్దేశం చేశారు.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!