Sammakka Sarakka: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దేల వద్దకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో గద్దెల వద్ద పారిశుధ్ద్యం పేరుకు పోయింది. అయితే అక్కడ పారిశుద్ద్యాన్ని తొలగించేందుకు అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు. గద్దెల వద్ద చెత్త చెదారం పేరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోనే మేడారంలో జరిగే జాతరకు ప్రత్యేక స్థానం ఉందని దీనిని అధికారులు పట్టించుకోకుండా ఉండటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Read also: Property Rates: దేశంలోని పలు నగరాల్లో ఏడాదిలో 19శాతం పెరిగిన ప్రాపర్టీ ధరలు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ మహా జాతరకు నెల గడువు ఉండగానే భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా సెలవురోజుల్లో, ఆదివారం, బుధవారం, గురువారం రోజుల్లో యాబై వేల నుండి లక్ష మందికి పైగా భక్తులు సమ్మక్క సారలమ్మ దేవతలకు ముక్కులు చెల్లిస్తున్నారు. భక్తుల రద్దీతో సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం మొత్తం కిటకిటలాదుతుంది. జాతర వచ్చే ప్రతి భక్తుడు బెల్లం తో పాటు కొబ్బరికాయలు పసుపు కుంకుమ అమ్మవార్ల సమర్పించడం ఆనవాయితీ ఈ క్రమంలో గద్దెలకు వచ్చే భక్తులు కొబ్బరికాయలను ప్లాస్టిక్ కవర్లలో తీసుకురావడంతో ప్లాస్టిక్ వినియోగం బాగా పెరిగింది. మేడారం జాతరలో ఏ దుకాణం లో చూసినా కనబడుతుంది. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని అరికట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో, కొబ్బరికాయలు కొట్టి బెల్లం సమర్పించిన కవర్లు కొబ్బరి పీచు పదార్థాలు అన్ని ఆలయ ప్రాంగణంలో వదిలేస్తున్నారు. ఎక్కడ వేసిన చెత్తా అక్కడే పేరుకుపోవడంతో ఆలయ ప్రాంగణం అంతా చెత్తతో నిండిపోయింది.
అయితే ఆలయం ఆవరణలో ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. జాతరకు కోటికి పైగా భక్తులు వస్తారని అంచనా ఉన్న నేపథ్యంలో ప్లాస్టిక్ వినియోగించకుండా వాటి స్థానంలో జ్యూట్ బ్యాగులు అమ్మేలా అధికారులను చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. గద్దెల వద్ద అమ్మవార్లకు సమర్పించిన కొబ్బరికాయలు, బెల్లాన్ని తరలిస్తున్నారు అంతే గానీ వాటి వల్ల వచ్చిన కావర్స్,కొబ్బరి పీచును శుభ్రం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం లో ఇప్పటికే గ్రామ పంచాయతీ అధికారులు షాపుల యజమానులకు ప్లాస్టిక్ కవర్లు వినియోగించద్దని నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ జాతరలో ఏ దుకాణం చూసిన ప్లాస్టిక్ కవర్లు దర్శనమిస్తున్నాయని భక్తులు మండిపడుతున్నారు. దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, గద్దెల వద్ద వున్న చెత్తను వెంటనే తొలగించాలని కోరుతున్నారు.
Sivaji: హీరో శివాజీ చేతుల మీదగా ‘మార్కెట్ మహాలక్ష్మి’ మూవీ టైటిల్ పోస్టర్ లాంచ్..