కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు. ఈ మూవీ ‘టైటిల్ పోస్టర్’ని బిగ్ బాస్ ఫెమ్ హీరో ‘శివాజీ’ చేతుల మీదగా ఈ రోజు ఆవిష్కరణ జరగగా, ప్రొడ్యూజర్ బెక్కెం వేణుగోపాల్ అతిధి గా వచ్చి టీం ని విష్ చేసారు. మూవీ పోస్టర్ ఆవిష్కరణ చేసిన అనంతరం…..
హీరో శివాజీ మాట్లాడుతూ: నేను 27 ఏళ్ళ వయసులో యాక్టింగ్ మొదలు పెడితే దాదాపు 50 యేళ్ళకి నాకు గుర్తింపు వచ్చింది. ఏదో, ఒక రోజు గుర్తింపు అనేది వస్తుంది. కాకపోతే క్యారెక్టర్, హార్డ్ వర్క్, ఓపిక ఇంపార్టెంట్. ‘కేరింత’ మూవీతో కేరీర్ స్టార్ట్ చేసిన హీరో ‘పార్వతీశం’ కి తప్పకుండ ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వస్తుంది అని నాకు బలమైన నమ్మకం ఉంది. ప్రొడ్యూసర్ ‘అఖిలేష్ కలారు’కి మంచి లాభాలు చేకుర్చాలి. డైరెక్టర్ ‘ వియస్ ముఖేష్’ కథ బాగా తీసి ఉంటారని నమ్ముతున్నాను. హీరోయిన్ ‘ప్రణీకాన్వికా’ నేమ్ టంగ్ ట్విస్టర్ లా ఉంది. ఆర్ట్ ఫార్మ్ ని నమ్ముకున్న ప్రతి ఒక్కరు తప్పకుండ సక్సెస్ అవ్వుతారు. అందరు నిజాయతి గా పనిచేయండి సక్సెస్ దానంతట అదే వస్తుంది. టీం అందరికి నా ఆల్ ది బెస్ట్ చెప్తూ, మహాలక్ష్మి ‘మార్కెట్ మహాలక్ష్మి’ మజాకులు ఆడితే మంచిగుండదు. తనడైన స్టైల్ లో డైలాగ్ చెప్పి నవ్వించి ముగించారు.
ప్రొడ్యూజర్ ‘బెక్కమ్ వేణుగోపాల్’ మాట్లాడుతూ: ‘మార్కెట్ మహాలక్ష్మి’ సినిమా నేను ముందుగానే చూడటం జరిగింది. సినిమా చూసినప్పుడు నాకు శేఖర్ కమ్ముల గారి సినిమాలు గుర్తొచ్చాయి. ఒక చక్కటి ఫ్యామిలీ లవ్ డ్రామా గా తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. ఎక్కడ ల్యాగ్ లేకుండా, ఫ్యామిలీ & లవ్ ఎమోషన్స్ ని పండించారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అద్భుతంగా పెర్ఫామ్ చేసారు. ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు కు , వియస్ ముఖేష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు..
డైరెక్టర్ ‘వియస్ ముఖేష్’ మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రం టైటిల్ ఆవిష్కరించిన శివాజీ గారికి, సహకరించిన బెక్కం వేణు గోపాల్ కి ధన్యవాదాలు. నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన మా నిర్మాత అఖిలేష్ గారికి, నా విజన్ ని నమ్మి ఈ చిత్రంలో నటించడానికి ముందుకి వచ్చినా హీరో హీరోయిన్ లకు తదితర నటి నటులకు పేరు పేరునా ప్రతి ఒక్కరకి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
నటీనటులు: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్, తదితరులు….
టెక్నికల్ టీమ్:
రచన & దర్శకత్వం: వియస్ ముఖేష్
ప్రొడ్యూసర్: అఖిలేష్ కలారు
ప్రొడక్షన్ హౌస్: బి2పి స్టూడియోస్
సంగీతం: మిష్టర్ జో
సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల
ఎడిటర్: ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లి
పాటలు: వియస్ ముఖేష్, మిష్టర్ జో
బ్యాగ్రౌండ్ స్కోర్: సృజన శశాంక
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: లోకేష్. పి
కొరియోగ్రఫీ: రాకీ
ఆర్ట్ డైరెక్టర్: సంజన కంచల
కాస్ట్యూమ్ డిజైనర్: ప్రియాంక పాండ
పోస్టర్ డిజైనర్: రానా
పీఆర్వో: తిరుమలశెట్టి వెంకటేష్